Realme Narzo 30 Pro: రియల్మీ నుంచి నార్జో 30 సిరీస్‌లో వచ్చిన 5జీ స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్మీ నార్జో 30 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ రియర్ కెమెరా సెటప్ ఉండగా ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా 8జీబీ+128జీబీ ధర రూ.19,999. (image: Realme India)
Realme Narzo 30A: రియల్మీ నార్జో 30 సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్మీ నార్జో 30ఏ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా ఉండగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ ధర రూ.9,999. (image: Realme India)
Moto E7 Power: మోటో ఈ7 పవర్ ఇటీవల రిలీజైంది. మోటో ఈ7 పవర్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ సిమ్ సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,499 కాగా 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.8,299. (image: Motorola India)
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.25,999.
సాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 6.5 హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999.
Vivo Y31: వివో వై31 రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,490.
Samsung Galaxy M02s: ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్మార్ట్‌ఫోన్ జనవరి 7న రిలీజైంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఐఎస్ఓ కంట్రోల్, ఆటో ఫ్లాష్, డిజిటల్ జూమ్, హెచ్డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Samsung India)
Samsung Galaxy M02s: సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ కాగా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. (image: Samsung India)
Lava Z1: లావా జెడ్1 జనవరి 7న రిలీజైంది. లావా జెడ్1 స్పెసిఫికేషన్స్ చూస్తే 5 అంగుళాలు డిస్ప్లే ఉంది. ర్యామ్ 2జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబీ. మీడియాటెక్ హీలియో ఏ20 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,100ఎంఏహెచ్. ధర రూ.5,499. (image: Lava Mobiles)
Lava Z2: లావా జెడ్2 జనవరి 7న రిలీజైంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ర్యామ్ 2జీబీ కాగా ఇంటర్నల్ స్టోరేజ్ 32జీబీ. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.6,999. (image: Lava Mobiles)
Lava Z4: లావా జెడ్4 జనవరి 7న రిలీజైంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ర్యామ్ 4జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ప్రైమసీ కెమెరా + 2 మెగాపిక్సెల్ ఏఐ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. ధర రూ.8,999. (image: Lava Mobiles)
Lava Z4: లావా జెడ్6 జనవరి 7న రిలీజైంది. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ర్యామ్ 6జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ప్రైమసీ కెమెరా + 2 మెగాపిక్సెల్ ఏఐ డెప్త్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ కాగా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.9,999. (image: Lava Mobiles)
Xiaomi Mi 10i: షావోమీ ఎంఐ 10ఐ మోడల్‌ను ఇండియాలో జనవరి 5న రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. దీంతో పాటు స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,820ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.23,999. (image: Xiaomi India)
Xiaomi Mi 10i: ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ముందు, వెనుకవైపు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ 750జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్ చూస్తే 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు ఇష్టపడేవారి కోసం ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో ముందువైపు 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌లో 4,820ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను అట్లాంటిక్ బ్లూ, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)