POCO M4 Pro 5G : గేమింగ్ అవసరాలకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. పోకో M4 Pro 5G స్మార్ట్‌ఫోన్ 5G-రెడీ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేటు, 90Hz 6.6” FHD+ డిస్ప్లేను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ సెటప్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. పోకో M4 Pro 5G పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.9,749కే సొంతం చేసుకోవచ్చు.
POCO F4 5G : పోకో F4 5G స్మార్ట్‌ఫోన్ హెవీ వర్క్, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్లకు బెస్ట్ ఆప్షన్. 7nm ప్రాసెసర్‌పై అభివృద్ధి చేసిన స్నాప్‌డ్రాగన్ 870 ఫ్లాగ్షిప్ చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఇది 6.67-అంగుళాల E4 AMOLED స్క్రీన్, అల్ట్రా-స్మాల్ 2.76mm డాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. 67W సోనిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీ ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో F4 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు.
POCO X4 Pro 5G : ఇది వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌కు బెస్ట్ ఆప్షన్. పోకో X4 Pro 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695, అడ్వాన్స్డ్ 6nm ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. X-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 120Hz సూపర్ AMOLED స్క్రీన్‌ను అందిస్తుంది. 67W MMT సోనిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. పోకో X4 Pro 5G ఫోన్లో 64MP కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఎటువంటి లైటింగ్‌లో అయినా బెస్ట్ ఫొటోలను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో X4 Pro 5G ఫోన్‌ను రూ.13,999కి సొంతం చేసుకోవచ్చు.
POCO M4 5G : మొబైల్ గేమింగ్‌ను ఆస్వాదించే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్. పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ బెస్ట్ మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. దీని 90Hz FHD+ స్మార్ట్ డిస్ప్లే స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. 50MP AI డ్యూయల్ కెమెరాతో పోకో M4 5G అద్భుతమైన కెమెరా పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీని అందిస్తోంది. M-సిరీస్ వరుసలో పోకో M4 5G ఆకర్షణీయమైన స్విర్ల్ డిజైన్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో M4 5G స్మార్ట్‌ఫోన్ రూ.9,749కి అందుబాటులో ఉంటుంది.