1. కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ఫోన్లు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. బేసిక్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) కొనాలనుకునేవారికి పోకో ఇండియా నుంచి గతవారం రూ.7,000 లోపు బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. పోకో సీ50 (Poco C50) మోడల్‌ను పరిచయం చేసింది. పోకో సీ సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. (image: Poco India)
2. ఇందులో 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలియో ఏ22 లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునేవారు, సెకండరీ మొబైల్ వాడాలనుకునేవారు, తక్కువ బడ్జెట్లో మొబైల్ కావాలనుకునేవారు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిశీలించవచ్చు. పోకో సీ50 ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు తెలుసుకోండి. (image: Poco India)
3. పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499 కాగా, 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299. జనవరి 10న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద బేస్ వేరియంట్‌ను రూ.6,249 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
4. పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. లెదర్ లాంటి టెక్స్చర్తో బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇండియాలో టెక్నో స్పార్క్ గో 2022, లావా బ్లేజ్, టెక్నా పాప్ 5 ప్రో, ఇన్ఫీనిక్స్ హాట్ 12ఐ లాంటి మోడల్స్ ఉన్నాయి. (image: Poco India)