1. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఇటీవల మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది పోకో ఇండియా. రూ.10,000 లోపు బడ్జెట్లో పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. గతంలో రిలీజ్ అయిన పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది. (image: Poco India)
2. పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వర్షన్ పోకో సీ31 మోడల్‌ను రిలీజ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. పోకో సీ31 ప్రారంభ ధర రూ.8,499. ఇది 3జీబీ ర్యామ్ + 32జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది పోకో. ధర రూ.9,499. (image: Poco India)
3 పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్ ఉన్నాయి. లాంఛ్ ఆఫర్లో భాగంగా పోకో ఇండియా రూ.500 తగ్గింపు ప్రకటించింది. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్‌ను రూ.7,999 ధరకు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
4. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. కాబట్టి పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్‌ను రూ.7,199 ధరకు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.8,099 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
5. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మెమొరీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Poco India)
6. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + రెండు 2మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఆటోఫోకస్, హెచ్డీఆర్, ఏఐ పోర్ట్రైట్ మోడ్, ఫేస్ రికగ్నిషన్, ఏఐ సీన్ డిటెక్షన్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Poco India)
7. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండురోజులు వాడుకోవచ్చని పోకో ఇండియా చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ యాడ్ ఫ్రీ, బ్లోట్ ఫ్రీ అని కంపెనీ ప్రకటించడం విశేషం. రియర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉన్నాయి. పోకో సీ31 స్మార్ట్‌ఫోన్‌ను షాడో గ్రే, రాయల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)