ఇండియా డెవలప్ అవుతోంది. తమ క్రియేటివిటీకి పని పెడుతున్న ఆర్కిటెక్ట్స్ అత్యద్భుతమైన భవనాల్ని నిర్మిస్తున్నారు. అలాంటి కొన్ని ఆఫీస్ భవనాల్ని తెలుసుకుందాం.
2/ 12
Infosys Multiplex, Mysore : ఓ భారీ గోల్ఫ్ బాల్ ఆకారంలలో ఉంటుంది కర్ణాటక మైసూర్‌లోని ఇన్ఫోసిస్ ట్రైనింగ్ రూం. ఇది 14.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
3/ 12
Adobe Headquarters, Noida : ఆఫీస్ బిల్డింగ్ ఇలా ఉంటే, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మెరుస్తున్న బ్లాక్స్ దీనికి అదనపు అందాన్ని ఇచ్చాయి.
4/ 12
Cybertecture Egg, Mumbai : కోడి గుడ్డులా ఉన్న ఇది ముంబైలో నిర్మించిన 13 అంతస్థుల భవనం. దీన్ని జేమ్స్ లా సైబర్ టెక్చర్ అండ్ ఓవ్ అరూప్ నిర్మించారు.
5/ 12
DLF Gateway, Gurugram : గురుగ్రాంలోని ఎత్తైన స్క్రైస్క్రాపర్స్లో ఇదొకటి. నౌక ఆకారంలో దీన్ని నిర్మించారు. ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ ఉంది.
6/ 12
Statesman House, New Delhi : కన్నాట్ ప్లేస్‌లోని ఎత్తైన భవనాల్లో ఇదొకటి. చూడటానికి సంప్రదాయ భవనంలా ఉంటూ, భలే ఉందే అనిపిస్తుంది. సిలిండర్ లాంటి ఆకారం పైకి వెళ్లే కొద్దీ కట్ అవుతూ ఉంటుంది.
7/ 12
EDRC, Chennai : అద్భుతమైన గ్రీన్ కార్పొరేట్ భవనాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది ఈ EDRC భవనం.
8/ 12
Software development Block, Infosys, Mysore : జపనీస్ పేపర్ ఆర్ట్... ఓరిగామి కళ ఆదర్శంగా మైసూర్ హెడ్‌క్వార్టర్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్ నంబర్ 4ని నిర్మించారు.
9/ 12
Patni Knowledge Park, Mumbai : ముంబైలోని అతి పెద్ద సాఫ్ట్వేర్ పార్కుల్లో ఇదొకటి. సాధారణంగా భవనాలు పునాది పెద్దగా... పైకి వెళ్లే కొద్దీ చిన్నగా ఉంటాయి. ఇది అందుకు విరుద్ధంగా... పైకి వెళ్లే కొద్దీ పెద్దగా ఉంటుంది.
10/ 12
I-Flex Solutions, Bangalore : పూ రేకుల లాంటి బ్లాక్స్, కంపార్ట్‌మెంట్స్‌తో 1,44,000 చదరపు అడుగులు, 1500 ఎంప్లాయీస్‌తో ఆకట్టుకుంటోంది ఈ భవనం.
11/ 12
Shree Cement, Jaipur : ప్రముఖ ఆర్కిటెక్ట్ సంజయ్ పురి నిర్మించిన భవనం ఇది. దీన్ని 72 స్క్రీన్స్ బిల్డింగ్ అంటున్నారు. రాత్రి వేళ ఈ భవనం రకరకాల రంగుల్లోకి మారిపోతూ ఆకట్టుకుంటుంది.
12/ 12
The South Asian Human Rights Documentation Centre, New Delhi : ఈ ప్రభుత్వేతర భవనం ప్రత్యేకమైన ఇటుక రాతి నిర్మాణంతో ఆశ్చర్యపరుస్తుంది. మానవ హక్కులకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తోంది.