Paytm Postpaid Service | మీ దగ్గర డబ్బులు లేవా? పేటీఎంలో ఏదైనా కొనాలనుకుంటున్నారా? ఏం పర్లేదు. డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 వరకు షాపింగ్ చేయొచ్చు. పేటీఎం ప్రారంభించిన ఈ సర్వీస్ వివరాలేంటో తెలుసుకోండి.
పేటీఎం లాంటి ఇ-వ్యాలెట్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ఇస్తుంటాయి. రోజుకో కొత్త ఆఫర్ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి. పేటీఎం తమ యూజర్ల కోసం ఇలాంటి ఓ సర్వీస్‌ని ప్రారంభించింది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయొచ్చు.
2/ 5
కొత్త సంవత్సర వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్‌పెయిడ్ సర్వీస్‌ని ప్రారంభించింది పేటీఎం. ఇందులో మీరు మీ వ్యాలెట్‌లో డబ్బులు లేకపోయినా రూ.60,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ డబ్బు తర్వాతి నెలలో చెల్లిస్తే చాలు. క్రెడిట్ కార్డు లేనివారికి ఉపయోగపడే సర్వీస్ ఇది.
3/ 5
పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీస్ కొద్ది మంది యూజర్లకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ రీఛార్జ్, మూవీ టికెట్స్, ట్రెయిన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్‌తో పాటు షాపింగ్ కోసం పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీస్ వాడుకోవచ్చు.
4/ 5
పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీస్‌లో మీరు ఎంత డబ్బు వాడుకుంటే అంత వచ్చే నెలలో చెల్లించాలి. బిల్లును వచ్చే నెల మొదటి తారీఖున మీకు పంపిస్తారు. మీరు 7వ తేదీ లోపు బిల్లు చెల్లించాలి. ఒకవేళ ఈ గడువులోగా బిల్లు కట్టకపోతే ఆ తర్వాత జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
5/ 5
మీరు పేటీఎం పోస్ట్ పెయిడ్ సర్వీస్ వాడుకోవాలనుకుంటే యాప్‌లో లాగిన్ కావాలి. మీకు పేటీఎం నుంచి పోస్ట్ పెయిడ్ సర్వీస్ ఆఫర్ ఉందో లేదో చూసుకోవాలి. మీకు ఇచ్చిన లిమిట్ ఎంతో చూసి ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటివరకు పేటీఎం పోస్ట్ పెయిడ్ ఆఫర్ రానివాళ్లకు భవిష్యత్తులో వచ్చే అవకాశముంది.