2. 'పేటీఎం ఫస్ట్' సబ్స్క్రిప్షన్ ధర రూ.750. ప్రారంభ ఆఫర్ కింద రూ.100 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పేటీఎం ఫస్ట్ కస్టమర్లు పేటీఎంతో పాటు పార్ట్నర్డ్ బ్రాండ్స్ నుంచి ప్రత్యేకమైన బెనిఫిట్స్ పొందొచ్చు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ సర్వీసులు ఉన్నాయి. వాటికి పోటీగా పేటీఎం ఇప్పుడు 'పేటీఎం ఫస్ట్' తీసుకొచ్చింది. మీ పేటీఎం యాప్ ఓపెన్ చేస్తే అందులో పేటీఎం ఫస్ట్ ఐకాన్ కనిపిస్తుంది.
3. పేటీఎం యాప్‌లో పేటీఎం ఫస్ట్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఏఏ బెనిఫిట్స్ లభిస్తాయో వివరంగా ఉంటాయి. రూ.750 చెల్లించి ఏడాదికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతీ నెల రూ.500 పేటీఎం వ్యాలెట్‌లో యాడ్ చేసిన వారికి రూ.30 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా 12 నెలల పాటు రూ.360 క్యాష్‌బ్యాక్ వస్తుంది. దాంతో పాటు ప్రతీ నెల సినిమా టికెట్లపై రూ.100 చొప్పున 12 నెలలకు రూ.1,200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.