ఫీచర్ల విషయానికొస్తే.. Oppo Reno 9 Pro Plus మోడల్ 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8 ప్లస్ Gen 1 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా మరియు 4700 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందించవచ్చు. (image: Oppo India)
OPPO నుంచి స్మార్ట్ ఫోన్లే కాకుండా స్మార్ట్ టీవలను కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చైనాలో కొత్త 50-అంగుళాల స్మార్ట్ టీవీని పరిచయం చేయడం ద్వారా OPPO K9x స్మార్ట్ టీవీ సిరీస్ను విస్తరించింది. కంపెనీ ఇంతకుముందు 65 అంగుళాల పరిమాణంలో ఈ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. కొత్త టీవీ 4K రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్ కోర్ మీడియా టెక్ చిప్సెట్ మరియు మరిన్నింటితో వస్తుంది.