ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఒప్పొ రెనో 7 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 24 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకో రూ. 4,750 చెల్లిస్తే.. కొత్త 5జీ ఫోన్ లభిస్తుంది. అయితే ఎక్స్చేజం ఆఫర్ అనేది మీ ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన మారుతుంది. కొన్ని ఫోన్లకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా ఉండొచ్చు. అప్పుడు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
ఇక ఈ ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ 3 నెలల వరకే ఉంటుంది. అంటే నెలకు రూ. 9,667 చెల్లించాలి. అదే సాధారణ ఈఎంఐ అయితే 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1400 చెల్లిస్తే సరిపోతుంది. అదే 18 నెలలు అయితే రూ. 1810 పడుతుంది. 12 నెలలు అయితే రూ. 2600 చెల్లించాలి.