1. ఒప్పో గతేడాది రిలీజ్ చేసిన ఒప్పో ఏ54 (Oppo A54) స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. ఒప్పో ఇండియా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది. దీంతో 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990 నుంచి రూ.13,990 ధరకు, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990 నుంచి రూ.14,990 ధరకు, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990 నుంచి రూ.15,990 ధరకు దిగొచ్చింది. (image: Oppo India)
2. అయితే గతేడాది ఈ స్మార్ట్‌ఫోన్ ఇంతకన్నా తక్కువ ధరకే లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.13,490 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,490 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.15,990 ధరకు రిలీజ్ అయింది. ఆ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,500 పెరిగింది. (image: Oppo India)
3. ఇప్పుడు ఒప్పో ఏ54 ప్రైస్ తగ్గినా రిలీజ్ ధరలతో పోలిస్తే రూ.500 ధర ఎక్కువ. అయితే గతేడాది స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ధరల్ని పెంచాయి. గ్లోబల్ మార్కెట్లో చిప్ షార్టేజ్ ఉండటం, విడిభాగాల ధరలు పెరగడంతో దాదాపు అన్ని బ్రాండ్లు మార్కెట్లో ఉన్న స్మార్ట్ఫోన్ల ధరల్ని పెంచుతూ వచ్చాయి. (image: Oppo India)
5. ఒప్పో ఏ54 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 10 + కలర్ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. (image: Oppo India)
6. ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో ఎక్స్పర్ట్, పనోరమిక్, పోర్ట్రైట్, నైట్, మ్యాక్రో కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
7. ఒప్పో ఏ54 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ, వైఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఆఫ్షన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను క్రిస్టల్ బ్లాక్, మూన్లైట్ గోల్డ్, స్టారీ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Oppo India)