Amazon Sale: అమెజాన్ మరో కొత్త సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు!
Amazon Sale: అమెజాన్ మరో కొత్త సేల్.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు!
Oppo Smartphone Offers | కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి అమెజాన్ శుభవార్త అందించింది. కొత్త సేల్ తీసుకువచ్చింది. ప్రీమియం నుంచి బడ్జెట్ ఫోన్ల వరకు పలు మోడళ్లపై అదిరే ఆఫర్లు అందిస్తోంది.
Oppo Discount Offers | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే శుభవార్త. ఎందుకంటే ఒప్పొ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. ఒప్పొ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
2/ 8
ఒప్పొ కంపెనీ ఒప్పొ ఫెంటాస్టిక్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంది. నవంబర్ 9 వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ఒప్పొ ప్రీమియం, మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లపై అదిరే ఆఫర్లు పొందొచ్చు.
3/ 8
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. అదనపు తగ్గింపు బెనిఫిట్స్ పొందొచ్చు. 10 శాతం తక్షణ తగ్గింపు వస్తుంది. కేవలం స్మార్ట్ఫోన్లపై మీదనే కాకుండా ఆడియో యాక్ససిరీస్, వేరబుల్స్ వంటి వాటిపై కూడా ఆఫర్లు పొందొచ్చు.
4/ 8
ఒప్పొ ఎఫ్21ఎస్ ప్రో ఫోన్‌పై అదిరే తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు రేటు రూ. 27,999. అయితే దీన్ని ఇప్పుడు రూ. 21,999కు కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద ఇన్స్టంట్ డిస్కౌంట్ రూ.2 వేల వరకు వస్తుంది.
5/ 8
అలాగే ఒప్పొ ఎఫ్21ఎస్ ప్రో 5జీ ఫోన్‌పై కూడా డీల్స్ ఉన్నాయి. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కింద తక్షణం రూ.2 వేల తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్లో 64 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ అసలు రేటు రూ. 31,999. అయితే దీన్ని రూ. 25,999కు కొనొచ్చు.
6/ 8
ఒప్పొ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు పొందొచ్చు. ఒప్పొ ఏ74 ఫోన్‌ను రూ. 20,990కు కాకుండా రూ. 14,990కు కొనొచ్చు. ఇంకా ఒప్పొ ఏ31, ఒప్పొ ఏ54, ఒప్పొ ఏ15ఎస్, ఒప్పొ ఏ96, ఒప్పొ ఏ76 ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
7/ 8
ఒప్పొ ఏ77 ఎస్ ఫోన్‌ను రూ. 17,999కు కొనొచ్చు. దీని అసలు రేటు రూ. 22,999. సేల్‌లో ఒప్పొ ఏ57 ఫోన్‌ను రూ. 13,999కు పొందొచ్చు. ఒప్పొ ఏ17 ఫోన్‌ను రూ. 14,999కు కాకుండా రూ. 12,499కు సొంతం చేసుకోవచ్చు. ఇలా ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
8/ 8
అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల కొన్ని ఫోన్లకు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. ఇకపోతే క్రెడిట్ కార్డు కలిగిన వారు ఈఎంఐ రూపంలో నచ్చిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.