ఒప్పో విడుదల చేసిన టీజర్‌ను బట్టి చూస్తే.. ఈ వేరియంట్లు ఒప్పో రెనో 7 4G వెర్షన్‌ను పోలి ఉంటాయి. అయితే, వీటి డిజైన్ మాత్రం ఐఫోన్ SE 3, ఐక్యూ 9 SE మోడళ్లను పోలి ఉంటుంది. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్ ఏప్రిల్ 12, 2022న భారత్‌లో రిలీజ్ కానుంది. ఒప్పో "ఇండస్ట్రీ ఫస్ట్ ఫైబర్ గ్లాస్ లెదర్ డిజైన్”తో వస్తుంది. రిచ్ లుక్ కోసం లీచీ-గ్రెయిన్ లెదర్‌ని ఉపయోగించనున్నారు. (ప్రతీకాత్మకి చిత్రం)
ఒప్పో రెనో 7 4G రీబ్రాండెడ్ వెర్షన్‌గా..
ఒప్పో F21 ప్రో డిజైన్‌లో ఉపయోగించే లీచీ గ్రెయిన్ లెదర్ మెటీరియల్ వాటర్‌ప్రూఫ్, వేర్ రెసిస్టన్స్ను కలిగి ఉంటుంది. అందువల్ల, ఈ లెదర్ మెటీరియల్ ఎటువంటి కండీషన్‌ను అయినా ఎదుర్కోగలదు.ఈ వేగన్ లెదర్ ఫినిషింగ్ ఫోన్ సన్‌సెట్ ఆరెంజ్ కలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
[caption id="attachment_1189578" align="alignnone" width="1600"] లాంచింగ్‌కు సిద్దమవుతోన్న ఒప్పో ఎఫ్ 21 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇది 33W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన 6.4 -అంగుళాల FHD+ 90Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
[/caption]