1. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్‌లో ఇటీవల ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ (Oppo F21 Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. కాసేపట్లో అమెజాన్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రిలీజైన ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ (Oppo F21 Pro 4G) సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. (image: Oppo India)
3. అమెజాన్‌లో ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొంటే 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Oppo India)
5. ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్ ఇది. ఇదే ప్రాసెసర్ పోకో ఎక్స్4 ప్రో 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. (image: Oppo India)
6. ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 64మెగాపిక్సెల్ ఏఐ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలకు డ్యూయెల్ ఆర్బిట్ లైట్స్ ఆకట్టుకుంటాయి. రియర్ కెమెరాలో నైట్, ఫోటో, వీడియో, ఎక్స్పర్ట్, పనోరమా, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, స్లో-మోషన్, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్, ఎక్స్ట్రా హెచ్డీ, మ్యాక్రో, స్టిక్కర్, డ్యూయల్-వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
7. ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, నైట్, పనోరమిక్, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Oppo India)