1. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్‌లో (Oppo F21 Pro Series) ఇండియాలో ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ (Oppo F21 Pro 4G), ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ (Oppo F21 Pro 5G) స్మార్ట్‌ఫోన్స్ రిలీజైన సంగతి తెలిసిందే. ఒకే పేరుతో 4జీ, 5జీ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది ఒప్పో ఇండియా. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఈ మోడల్స్‌ని తీసుకొచ్చింది. (image: Oppo India)
2. వీటిలో ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ సేల్ ఏప్రిల్ 15న, ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ సేల్ ఏప్రిల్ 21న ప్రారంభం అవుతుంది. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్ స్మార్ట్ఫోన్లలో అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు రూ.25,000 లోపు సెగ్మెంట్లో రిలీజ్ కావడం విశేషం. (image: Oppo India)
3. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే రిలీజైంది. ధర రూ.22,999. సన్‌సెట్ ఆరెంజ్, కాస్మిక్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,300 డిస్కౌంట్ లభిస్తుంది. రూ.1,799 విలువైన ఒప్పో ఎం32 బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను కేవలం రూ.1,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
4. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Oppo India)
5. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మోనో లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్, ఫోటో, వీడియో, ఎక్స్పర్ట్, పనోరమా, పోర్ట్రైట్, టైమ్-లాప్స్, స్లో-మోషన్, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్, ఎక్స్‌స్ట్రా హెచ్డీ, మాక్రో, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
6. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ కెమెరా మెయిన్ హైలైట్. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ Sony IMX709 సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. సెల్ఫీ కెమెరాలో ఫోటో, వీడియో, పనోరమా, పోర్ట్రెయిట్, నైట్, టైమ్-లాప్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మంచి సెల్ఫీలు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. (image: Oppo India)