1. అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్21 ప్రో సిరీస్‌లో (Oppo F21 Pro Series) ఇండియాలో రిలీజైన ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ (Oppo F21 Pro 4G) మోడల్ తక్కువ ధరకే లభిస్తోంది. ఇదే సిరీస్‌లో ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ (Oppo F21 Pro 5G) మొబైల్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. 4జీ మోడల్‌ను రూ.10,000 లోపే కొనొచ్చు. (image: Oppo India)
2. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ ధర చూస్తే ఈ మొబైల్ కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే రిలీజైంది. ఎంఆర్పీ రూ.27,999 కాగా, అమెజాన్‌లో రూ.22,999 ధరకు లిస్ట్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.18,900 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించడం విశేషం. కస్టమర్ల పాత మొబైల్‌కు రూ.18,900 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే చెల్లించాల్సింది కేవలం రూ.4,090 మాత్రమే. (image: Oppo India)
3. అయితే రూ.18,900 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రావాలంటే హైఎండ్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేయాల్సి వస్తుంది. బడ్జెట్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15,000 లోపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపు సులువుగా సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో నేరుగా కొనాలనుకునేవారికి హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. (image: Oppo India)
4. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్మీ 10, రెడ్మీ నోట్ 11, వివో వై33టీ, రియల్మీ 9ఐ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Oppo India)
5. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మోనో లెన్స్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్, ఫోటో, వీడియో, ఎక్స్పర్ట్, పనోరమా, పోర్ట్రైట్, టైమ్-లాప్స్, స్లో-మోషన్, టెక్స్ట్ స్కానర్, గూగుల్ లెన్స్, ఎక్స్‌స్ట్రా హెచ్డీ, మాక్రో, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
6. ఒప్పో ఎఫ్21 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ కెమెరా మెయిన్ హైలైట్. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ Sony IMX709 సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. సెల్ఫీ కెమెరాలో ఫోటో, వీడియో, పనోరమా, పోర్ట్రెయిట్, నైట్, టైమ్-లాప్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మంచి సెల్ఫీలు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. (image: Oppo India)