1. స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపుతో లభించడం చాలా అరుదు. గతంలో రూ.20,000 లోపు రిలీజైన స్మార్ట్ఫోన్లు ఇప్పుడు రూ.15,000 లోపు లభిస్తుండటం విశేషం. గతేడాది ఒప్పో నుంచి రూ.20,000 లోపు బడ్జెట్లో ఒప్పో ఎఫ్19 (Oppo F19) రిలీజైంది. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో (Flipkart Electronics Sale) ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,490 ధరకే సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
2. ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ కేవలం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌లో మాత్రమే లభిస్తుంది. రిలీజ్ అయినప్పుడు ఈ మొబైల్ ధర రూ.18,990. ప్రస్తుతం రూ.14,990 ధరకే లిస్ట్ అయింది. అంటే రిలీజ్ ధరతో పోలిస్తే రూ.4,000 తక్కువకే లభిస్తోంది. ప్రిస్మ్ బ్లాక్, మిడ్నైట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Oppo India)
3. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి రూ.520 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Oppo India)
4. ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ.14,250 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఒప్పో ఎఫ్19 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో వై31, వివో వై20టీ, ఒప్పో ఎఫ్19ఎస్, రెడ్మీ 9 పవర్, పోకో ఎం3 లాంటి మోడల్స్‌లో ఉంది. (image: Oppo India)
5. ఒప్పో ఎఫ్19 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో వీడియో, నైట్షాట్, ప్రొఫెషన్, పనోరమా, పోర్ట్రైట్, టైమ్ ల్యాప్స్, స్లోమోషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు వీడియోకాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో వీడియో, పనోరమా, పోర్ట్రైట్, బ్యూటీ సెల్ఫీ, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)