1. ఒప్పో ఇండియా నుంచి ఇటీవల మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఒప్పో ఏ సిరీస్‌లో కొత్త మొబైల్ వచ్చింది. ఒప్పో ఏ77 (Oppo A77) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 (MediaTek Helio G35) ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. (image: Oppo India)
2. ఒప్పో ఏ77 కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో రిలీజ్ అయింది. ధర రూ.15,499. ఒప్పో అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనొచ్చు. సన్‌సెట్ ఆరెంజ్, స్కైబ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో సన్‌సెట్ ఆరెంజ్ లెదర్ వర్షన్లో లభిస్తుంది. ఆరెంజ్ కలర్ బ్యాక్ లెదర్లా ఉంటుంది. (image: Oppo India)
3. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఏ77 స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ కార్డులతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్‌లో రూ.14,650 వరకు, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్ ఒకే వేరియంట్లో లభిస్తుంది. (image: Oppo India)
4. ఒప్పో ఏ77 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ పోకో సీ31, ఒప్పో ఏ55 లాంటి మొబైల్స్‌లో కూడా ఉంది. ఒప్పో ఏ77 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Oppo India)
5. ఒప్పో ఏ77 కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో ఏ77 4జీబీ+64జీబీ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Oppo India)
6. ఒప్పో ఏ77 మొబైల్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే రూ.15,000 లోపు బడ్జెట్లో రియల్మీ నార్జో 50, పోకో ఎం4 ప్రో, ఐకూ జెడ్6, రెడ్మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 11, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13, మోటో జీ42, మోటో జీ51, సాంసంగ్ గెలాక్సీ ఎం13 లాంటి మోడల్స్ ఉన్నాయి. (image: Oppo India)