ఈ స్మార్ట్‌ఫోన్‌లో f/2.0 ఎపర్చర్‌తో 8MP సింగిల్-లెన్స్ రియర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్‌లో f/2.0 ఎపర్చర్‌తో 5MP సెల్ఫీ షూటర్ లభిస్తుంది. అంతేకాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో USB టైప్-C ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌గా.. 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్, GPS/GLONASS, 3.5 mm ఆడియో జాక్, FM రేడియో మరియు USB టైప్-C పోర్ట్ ఉండనుంది.
* ఒప్పొ ఎఫ్19ఎస్పై డిస్కౌంట్
టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా ప్లాట్ఫామ్లో ఒప్పొ ఎఫ్19ఎస్పై డిస్కౌంట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై క్రోమా రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో రూ.22,999 విలువైన ఈ ఫోన్‌ను రూ.19,990కు సొంతం చేసుకోవచ్చు. ఫ్రీ Qik EMI కార్డ్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే మూడు ఈజీ EMIలలో చెల్లింవచ్చు. ఈ ఆఫర్ రూ.5,000, అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రొడక్టులకు వర్తిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIపై కొనుగోలు చేస్తే 7.5% క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.
* ఒప్పొ ఎఫ్19ఎస్ స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ 6.43 అంగుళాల AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్సెట్ ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ ముందు వైపు 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 33W ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.