1. రూ.10,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ (Smartphone under Rs 10000) కొనాలనుకునేవారి కోసం ఒప్పో ఇండియా ఇటీవల కొత్త స్మార్ట్‌ఫోన్ పరిచయం చేసింది. ఒప్పో ఏ16కే (Oppo A16K) స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది ఒప్పో ఇండియా. గతేడాది రిలీజ్ అయిన ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ వర్షన్‌గా ఒప్పో ఏ16కే రిలీజ్ అయింది. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తుంది. ధర రూ.10,490. (image: Oppo India)
2. ఇండియాలో ఇప్పటికే రూ.10,000 బడ్జెట్లో నోకియా సీ20 ప్లస్, మోటో ఈ7, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్, రియల్మీ నార్జో 30ఏ, ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ పోటీ ఇవ్వనుంది. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్టోర్లలో కొనొచ్చు. అతి తక్కువ ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. (image: Oppo India)
3. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.364 ఈఎంఐ చెల్లించి ఈ మొబైల్ కొనొచ్చు. అమెజాన్‌లో రూ.494 ధర నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కొనేవారికి కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,950 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.9,950 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే మీరు కేవలం రూ.540 చెల్లిస్తే చాలు. ఈ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం అవుతుంది. (image: Oppo India)
4. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో ఆల్ డే ఐ కేర్ ఫీచర్ ఉంది. సన్‌లైట్ డిస్ప్లే, మూన్లైట్ డిస్ప్లే, ఏఐ స్మార్ట్ బ్యాక్‌లైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్‌లో 4,230ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. బ్యాటరీలో సూపర్‌నైట్ టైమ్ స్టాండ్‌బై, ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్, సూపర్‌పవర్ సేవింగ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
5. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో పోకో సీ31, నోకియా జీ20, రెడ్మీ 9, రియల్మీ సీ21 లాంటి మోడల్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 4జీ ఎల్టీఈ, వైఫై, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్ ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)
6. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాలో స్టైలిష్ ఫిల్టర్స్, బ్యాక్లిట్ హెచ్డీఆర్, డాజిల్ కలర్ మోడ్, నైట్ ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో హెచ్డీఆర్ నేచురల్ స్కిన్ రీటచింగ్, ఏఐ పలేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Oppo India)