1. ఆన్లైన్ షాపింగ్ మీకు వ్యసనమా? ఏం కొనాలని లేకున్నా... ఊరికే చూద్దామని యాప్ ఓపెన్ చేసి చివరకు ఏదో ఓ ఆఫర్‌కు టెంప్ట్ అయిపోయి అవసరం లేనివి కూడా కొనేస్తుంటారా? "ఇప్పుడు మీరు అవసరం లేని వస్తువుల్ని కొంటూ పోతూ ఉంటే... కొన్నాళ్ల తర్వాత మీకు అవసరమైన వస్తువుల్ని కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది" అని అపర కుబేరుడు వారెన్ బఫెట్ చెప్పిన మాట అక్షరాలా నిజం. (ప్రతీకాత్మక చిత్రం)
3. సేల్ పేరుతో ఇ-కామర్స్ సైట్లు చేసుకునే ప్రచారం వెనుక ఓ వ్యూహం ఉంటుంది. 60% నుంచి 90% వరకు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటిస్తాయి కొన్ని కంపెనీలు. ఇక్కడే మీరు ఓ విషయం గుర్తుంచుకోవాలి. 60% అంటే ఆ వస్తువు గరిష్ట రీటైల్ ధర(ఎంఆర్పీ)లో 60% అని అర్థం. ఎంఆర్పీ ఎంత అన్నది కంపెనీనే నిర్ణయిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒక వస్తువును ఎంత వరకు అమ్ముకోవచ్చో ఇ-కామర్స్ సైట్లకు సెల్లర్స్ సూచిస్తారు. సో... అక్కడ డిస్కౌంట్ ఎంత శాతం అన్నది ముఖ్యం కాదు. ఆ వస్తువు ఎంత విలువ చేస్తుందన్న అవగాహన మీకు ఉండాలి. ఒకవేళ మీరు అంచనా వేసిన విలువ కన్నా అది తక్కువ ధరకు వస్తుందనుకుంటే దర్జాగా కొనుక్కోవచ్చు. అంతేకానీ... ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నారన్నది చూడాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు కొనాలనుకున్న వస్తువుపై ఓ ధర నిర్ణయించారంటే అందులో వ్యాపారుల లాభం కూడా కలిపే ఉంటుంది. క్లియరెన్స్ సేల్ అని చెప్పినా వ్యాపారుల లాభం వ్యాపారులకు ఉంటుంది. కాకపోతే ఆ వస్తువు మీరు అనుకున్న ధరలోనే వస్తుందా లేదా అన్నది చూసుకుంటే చాలు. ఆఫర్లకు టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూ.1,000 విలువ చేసే వస్తువును సేల్ సమయంలో రూ.300 అమ్ముతున్నట్టు కొన్నిసార్లు ఇ-కామర్స్ సైట్లు ప్రకటిస్తుంటాయి. నిజానికి ఆ వస్తువు రేటు మీరు చూసినప్పుడు రూ.1,000 ఉంటుంది. సేల్ సమయంలో రూ.300 ధరకే ఇ-కామర్స్ సైట్ అమ్మడం కూడా నిజమే. ఇక్కడే కంపెనీ కస్టమర్లకు గాలం వేస్తుంది. రూ.300 ధరకు అమ్మేది కొన్ని వస్తువుల్ని మాత్రమే. అందుకే 'స్టాక్ ఉన్నంత వరకే' అన్న నిబంధన పెడుతుంది. అమ్మేది కొన్ని వస్తువులే అయినా భారీ తగ్గింపు అనే ప్రచారంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. సేల్స్ సమయంలో కొన్ని వేల ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు అని ప్రచారం చేస్తుంటాయి ఇ-కామర్స్ సైట్లు. అయితే అందులో కొంతవరకే నిజం ఉంటుంది. కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్ ఇచ్చి... మిగతా వస్తువుల్ని పాత ధరకే అమ్ముతుంటాయి. సేల్ పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం అన్నది వ్యాపార వ్యూహం. (ప్రతీకాత్మక చిత్రం)
9. సేల్ సమయంలో యాప్ చూసే వారికి గతంలో ఎంత ధర ఉంది? ఇప్పుడు ధర ఎంత? అన్న అవగాహన ఉండదు. యాప్‌లో, సైట్లో కస్టమర్ ఎక్కువ సేపు బ్రౌజ్ చేస్తూ ఉండటం వల్ల కొనాలనుకున్న వస్తువులతో పాటు మిగతావాటికీ అట్రాక్ట్ అవుతుంటారు. ఒక వస్తువు కొనాలనుకొని ఇంకో రెండు వస్తువులూ ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. అలా సేల్ సమయంలో ఇ-కామర్స్ సైట్లు తమ వ్యాపారాన్ని పెంచుకుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
12. కొన్ని క్రెడిట్ కార్డులపై 10 % వరకు డిస్కౌంట్లు ఇస్తుంటాయి ఇ-కామర్స్ సైట్లు. ఆ కార్డు మీ దగ్గర ఉంటే 10% లాభం. అయితే ఒకరి దగ్గర అన్ని కార్డులూ ఉండవు. ఇ-కామర్స్ సైట్ ఎప్పుడు ఏ కార్డుపై డిస్కౌంట్ ఇస్తుందో తెలియదు. అయితే కొన్ని సైట్లు సొంతగా వ్యాలెట్ సేవల్ని అందిస్తుంటాయి. కార్డుతో సంబంధం లేకుండా వ్యాలెట్ ద్వారా చెల్లించినా డిస్కౌంట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
14. కస్టమర్లను తమ సైట్లోకి, యాప్‌లోకి తీసుకురావాలన్నది ఇ-కామర్స్ సైట్లు నిర్వహించే ఫెస్టివల్ సేల్స్ లక్ష్యం. ఆ తర్వాత కస్టమర్లు భారీ డిస్కౌంట్లకు అట్రాక్ట్ అవుతారు. డిస్కౌంట్ల మాయలో పడి ఎక్కువగా షాపింగ్ చేసేస్తారు. తక్కువ ధరకే వస్తుంది కదా అని అవసరం లేని వస్తువులు కొంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
16. మీకు ఆన్లైన్ షాపింగ్ వ్యసనంగా మారినట్టు అనిపిస్తే... వెంటనే మీ ఫోన్లో ఇ-కామర్స్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసెయ్యండి. మీరు అత్యవసరంగా ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ యాప్ మీ ఫోన్లో లేనంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. మీకే ఇంకా మంచిది కూడా. డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
18. ఒక వస్తువు ధరెంతో కంపెనీ నిర్ణయించడం కాదు... మీరు కొనాలనుకునే వస్తువుపై కాస్త అధ్యయనం చేసి... దానికి మీరే ఓ విలువ కట్టండి. మీరు అనుకున్న ధరకే వస్తువు వస్తే కొనండి. అంతే తప్ప డిస్కౌంట్లను నమ్మకండి. ఒక్క ఇ-కామర్స్ సైట్లకే కాదు... బయట సూపర్ మార్కెట్లు, బడబడా షాపింగ్ మాల్స్‌లోనూ ఇవే నియమాలు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)