Nokia T20: నోకియా టీ20 ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 10.4 అంగుళాల 2కే ఇన్ సెల్ డిస్ప్లే ఉంది. 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇందులో 8,200ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్ ఓజో ప్లేబ్యాక్ సపోర్ట్ ఉంది.
Motorola Tab G70: మోటోరోలా ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. ఇది ట్యాబ్లెట్. మోటోరోలో స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఈ ట్యాబ్లెట్ ధర ఎంత ఉంటుందన్న క్లారిటీ లేదు. ఈ ట్యాబ్లెట్ రియల్మీ ప్యాడ్, నోకియా టీ20 ట్యాబ్, సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 లాంటి ట్యాబ్లెట్స్కు గట్టిపోటీ ఇవ్వనుంది.
Motorola Tab G70: మోటోరోలా ట్యాబ్ జీ70 స్పెసిఫికేషన్స్ చూస్తే మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 7,700 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండగా, 20వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభించనుంది.
Realme Pad: కొద్ది రోజుల క్రితం రియల్మీ నుంచి రిలీజ్ అయిన రియల్మీ ప్యాడ్ పాపులర్ అయింది. రియల్మీ ప్యాడ్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ.13.999 కాగా, 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వైఫై, ఎల్టీఈ వేరియంట్ ధర రూ.15.999. ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వైఫై, 4జీ ఎల్టీఈ వేరియంట్ ధర రూ.17,999.
Realme Pad: రియల్మీ ప్యాడ్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 10.4 అంగుళాల WUXGA+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 7,100ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ముందువైపు, వెనుకవైపు రెండు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
Lenovo Yoga Smart Tablet: లెనోవో యోగా స్మార్ట్ ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 10.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్లో 2వాట్ జేబీఎల్ స్పీకర్స్ ఉండటం విశేషం.