1. మైక్రోసాఫ్ట్ యాప్ స్టోర్‌లో డేంజరస్ మాల్వేర్ (Dangerous Malware) బయటపడింది. వేలాది కంప్యూటర్లపై ఈ మాల్వేర్ ప్రభావం చూపిస్తోంది. యూజర్ల సోషల్ మీడియా జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు ఈ మాల్వేర్ ఓ తలనొప్పిగా మారింది. చెక్ పాయింట్ రీసెర్చ్ ఈ మాల్వేర్ను గుర్తించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతేకాదు... యాడ్ క్లిక్కర్ లాగా ఈ మాల్వేర్ పనిచేస్తుంది. అంటే యూజర్ల ప్రమేయం లేకుండా యాడ్స్‌ని క్లిక్ చేస్తూ ఉంటుంది. చిన్నచిన్న వెబ్సైట్స్లోని యాడ్స్‌ని క్లిక్ చేస్తూ యాడ్ రెవెన్యూని జనరేట్ చేసేలా ఈ మాల్వేర్ పనిచేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా అకౌంట్స్‌ని చేజిక్కించుకుంటుంది కాబట్టి ఫేక్ యాప్స్‌ని, వెబ్‌సైట్స్‌ని కూడా ప్రమోట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. యూజర్ల బ్రౌజింగ్ ప్రవర్తనను అనుకరిస్తూ, వెబ్సైట్ ప్రొటెక్షన్స్ని తప్పించుకోగలదు. అటాకర్స్ సర్వర్ నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో జావాస్క్రిప్ట్ లోడ్ అవుతుంది. ఆ తర్వాత మాల్వేర్ డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ కూడా అవుతుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఆల్బమ్ బై గూగుల్ ఫోటోస్ పేరుతో ఈ మాల్వేర్ దాగి ఉన్నట్టు చెక్ పాయింట్ వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)