1. ఇండియన్ టెక్ మార్కెట్లో చైనీస్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. కేవలం స్మార్ట్ఫోన్లే కాకుండా టీవీలు, ఆడియో ప్రొడక్ట్స్, స్మార్ట్‌వాచ్‌లను తయారు చేస్తూ బ్రాండింగ్ రేంజ్‌ను పెంచుకుంటున్నాయి. తాజాగా చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ (OnePlus Nord Watch) ఇండియాలో లాంచ్ అయింది. (image: OnePlus India)
2. వన్‌ప్లస్ నుంచి నార్డ్ సిరీస్‌లో వచ్చిన మొదటి స్మార్ట్‌వాచ్ ఇది. నార్డ్ సిరీస్‌లో తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను వన్‌ప్లస్ లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నార్డ్ వాచ్ వచ్చేసింది. దీంట్లో కంపెనీ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్, స్ట్రెస్ మానిటర్ వంటి ఎన్నో ఫీచర్లను అందించింది. మన దేశంలో ఈ లేటెస్ట్ డివైజ్ ధర, ఫీచర్లు చెక్ చేద్దాం. (image: OnePlus India)
3. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 1.78 అంగుళాల HD AMOLED టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 500 nits వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ 105 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. నార్డ్ వాచ్‌లో ఇన్‌బిల్ట్ GPS ఉంటుంది. రన్నింగ్, వాకింగ్ ట్రాకర్, 3 యాక్సిస్ యాక్సిలెరోమీటర్, SpO2, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేటు, స్ట్రెస్ లెవల్ మానిటర్ వంటి అనేక ఫీచర్లు ఈ వాచ్ సొంతం. (image: OnePlus India)
4. నార్డ్ వాచ్ SF32LB555V4O6 చిప్సెట్తో, RTOSతో రన్ అవుతుంది. ఇది నాన్ లీనియర్ వైబ్రేషన్ మోటారుతో వస్తుంది. వాచ్‌లోని 230mAh బ్యాటరీ, మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్‌తో ఛార్జ్ అవుతుంది. ఇది గరిష్టంగా 30 రోజుల స్టాండ్‌బై టైమ్‌ను, సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. స్మార్ట్ వాచ్ కుడి వైపు పవర్ బటన్ ఉంటుంది. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 6, ఐఓఎస్ 11 అంతకంటే ఎక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో నడుస్తున్న ఫోన్లకు ఈ వాచ్ కంపాటబుల్‌గా ఉంటుంది. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ధర రూ.4,999గా ఉంది. ఇది మిడ్నైట్ బ్లాక్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌ను వన్‌ప్లస్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్స్, వన్‌ప్లస్ పార్ట్నర్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ వాచ్‌ను యాక్సిస్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 డిస్కౌంట్ పొందవచ్చు. అక్టోబర్ 4 నుంచి ICICI బ్యాంక్ కార్డులతో చేసే ట్రాన్సాక్షన్లపై రూ.500 తగ్గింపు ఉంటుంది. (image: OnePlus India)