OnePlus నుంచి సరికొత్త సూపర్‌ఫాస్ట్ 5G ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవీ!
OnePlus నుంచి సరికొత్త సూపర్‌ఫాస్ట్ 5G ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవీ!
ఇంటర్నెట్ 4G నుంచి 5Gకి అప్‌గ్రేడ్ అవ్వడంతో.. మొబైల్ కంపెనీలకు పెద్ద పనే పడింది. అన్నీ 5G మొబైల్స్ తెస్తూ పోటీ పడుతున్నాయి. OnePlus తన ఈవెంట్లలో ఒక దానిని భారతదేశంలో నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో నార్డ్ సిరీస్‌కి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ OnePlus Nord CE 3 Lite 5Gగా ఉంటుంది. ఇది గత సంవత్సరం భారతదేశంలో ప్రారంభించిన OnePlus Nord CE 2 Lite 5Gకి అప్‌గ్రేడ్‌గా ఏప్రిల్ 4న వస్తోంది.
ఏప్రిల్ 4న రాబోతోంది OnePlus Nord CE 3 Lite 5G మొబైల్. అంతకంటే ముందే.. దాని గురించి చాలా సమాచారం వెల్లడైంది. కంపెనీ స్వయంగా కొంత సమాచారం ఇచ్చినా.. అంతకంటే ఆసక్తికరమైన లీకులు బయటకు వచ్చాయి. (Image- OnePlus)
2/ 5
ధర గురించి మాట్లాడుకుంటే... భారతదేశంలో OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ. 21,999గా ఉంటుందని టిప్‌స్టర్ ట్విట్టర్ హ్యాండిల్లో తెలిపారు. ఈ ధర... 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన హ్యాండ్సెంట్కి వర్తిస్తుంది. (Image- OnePlus)
3/ 5
ఈ ఫోన్ పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు ఫీచర్ల గురించి చెప్పుకుంటే... ఈ ఫోన్ 108MP ప్రైమరీ కెమెరాతో వస్తుందని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది. (Image- OnePlus)
4/ 5
67W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉంటుంది. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో రోజంతా ఫోన్‌ను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. (Image- OnePlus)
5/ 5
ఈ ఫోన్‌కి LCD డిస్ప్లేతోపాటూ... స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ కలిగి ఉంటుందని లీక్ అయ్యింది. ఏప్రిల్ 4 ఈవెంట్లో కంపెనీ OnePlus Nord Buds 2 ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేస్తుందని తెలిసింది. (Image- OnePlus)