1. వన్‌ప్లస్ ఇటీవల ప్రీమియం ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 11 5జీ మొబైల్ లాంఛ్ చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, QHD+ అమొలెడ్ డిస్ప్లే, థర్డ్ జెన్ హ్యాసిల్బ్లాడ్ కెమెరా, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.56,999. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి. (image: OnePlus India)
2. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.61,999. ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఫిబ్రవరి 14న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. (Image: News18/Bharat Upadhyay)
3. వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనేవారికి రూ.24,940 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. 570 రెడ్కాయిన్స్ లభిస్తాయి. రెడ్ కేబుల్ క్లబ్ లింక్డ్ డివైజ్ బెనిఫిట్ కింద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.99 ధరకే లభిస్తుంది. జియో సిమ్ ఉన్నవారికి రూ.11,200 విలువైన ప్రయోజనాలు ఉంటాయని వన్‌ప్లస్ చెబుతోంది. (Image: News18/Bharat Upadhyay)
4. గూగుల్ వన్ నుంచి 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఆరు నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. 6 నెలల స్పాటిఫై ప్రీమియం ఉచితంగా లభిస్తుంది. ఇక రెడ్ కేబుల్ లైఫ్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్స్ అన్నీ వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనేవారికి లభిస్తాయి. అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. (image: OnePlus India)
5. వన్‌ప్లస్ 11 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల QHD+ ఫ్లెక్సిబుల్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమ్స్ ఆడేవారి కోసం హైపర్‌బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా + 48మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 32మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. హాసిల్బ్లాడ్తో కలిసి రియర్ కెమెరాను రూపొందించింది వన్‌ప్లస్. వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: OnePlus India)
7. వన్‌ప్లస్ 11 5జీ కెమెరాలో ఫోటో మోడ్, వీడియో మోడ్, పోర్టైట్ మోడ్, నైట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, మూవీ మోడ్, స్లో-మోషన్, టైమ్-లాప్స్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్-వ్యూ వీడియో, టిల్ట్-షిఫ్ట్ మోడ్, ఎక్స్‌పాన్ మోడ్, ఆటో మాక్రో, మాస్టర్ స్టైల్ ఫ్లైటర్స్, రీటచ్, AI హైలైట్ వీడియో, అల్ట్రా స్టెడీ ప్రో, రా ప్లస్ ఫైల్, గూగుల్ లెన్స్, 10బిట్ కలర్, హై ఎఫిషియెన్సీ ఇమేజ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ ఉండటం విశేషం. (image: OnePlus India)