Qualcomm Snapdragon 8 Gen 2 SoCతో కూడిన మొదటి ఫోన్లలో ఒకటిగా చైనాలో అధికారికంగా ప్రవేశించిన తర్వాత OnePlus 11 భారతదేశంలో లాంచ్ అయింది. OnePlus 11R, మరోవైపు.. గత సంవత్సరం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్ ద్వారా అందించబడిన మరింత ఆకర్షణీయమైన మోడల్ లో ఇది విడుదలైంది. AMOLED డిస్ప్లే.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదలైంది.
OnePlus 11 ఫీచర్లు: 6.7 అంగుళాల 3216x1440 పిక్సెల్ QHD+ 2.75D ఫ్లెక్సిబుల్ కర్వ్డ్ AMOLED LTPO డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. కెమెరాల విషయానికొస్తే.. OnePlus 11 5G వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OISతో 50MP Sony IMX890 సెన్సార్, 48MP సోనీ IMX581 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 32MP సోనీ IMX709 RGBW 2x టెలిఫోటో కెమెరా ఉన్నాయి.