స్మార్ట్‌పోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) వరుసగా మిడ్ రేంజ్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. కస్టమర్ల అవసరాలకు తగినట్లు వివిధ స్మార్ట్ఫోన్లను వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఇండియాలో మరో కొత్త డివైజ్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వన్‌ప్లస్ 10T మోడల్లో టాప్ వేరియంట్‌ను వచ్చే వారం కంపెనీ రిలీజ్ చేయనుంది.
ఈ నెల ప్రారంభంలోనే వన్‌ప్లస్ 10T (OnePlus 10T) ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని సేల్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే వన్‌ప్లస్ 10Tలో 16GB RAMతో టాప్ వేరియంట్ లాంచ్ టైమ్‌లో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేస్తోంది. ఇండియన్ కస్టమర్లకు వచ్చే వారం నుంచి టాప్-ఎండ్ వేరియంట్‌ను తీసుకువస్తోంది. ఆగస్టు 16 నుంచి దీని సేల్స్ ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్ కూడా 5G కనెక్టివిటీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్తో పాటు ఇతర వన్‌ప్లస్ 10T సిగ్నేచర్ ఫీచర్లను కలిగి ఉంటుంది. 16GB RAM వెర్షన్ 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
వన్‌ప్లస్ 10T ఫోన్ 8GB/128GB వేరియంట్ ఫోన్ ధర రూ.49,999, 12GB/256GB వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. కొత్త 16GB RAM వేరియంట్ ధర 12GB వేరియంట్ కంటే రూ. 1,000 ఎక్కువగా ఉంటుంది. ఈ టాప్ ఎండ్ ఫోన్ ధర రూ.55,999. ఈ వేరియంట్ మూన్‌స్టోన్ బ్లాక్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 10Tలో జేడ్ గ్రీన్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు 12GB/256GB లేదా 8GB/128GB మోడళ్లను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వన్‌ప్లస్ 10T 5G ఫోన్ 16GB/256GB వేరియంట్‌ను SBI బ్యాంక్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే.. రూ. 5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డ్ యూజర్లు 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా పొందుతారు. ఈ రెండు ఆఫర్లు OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయి.