1. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. వన్‌ప్లస్ ఇండియా వన్‌ప్లస్ 10 సిరీస్‌లో వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్‌లో సేల్ కొనసాగుతోంది. ఈ మొబైల్‌పై 8 బ్యాంక్ ఆఫర్స్ (Bank Offers) లభిస్తున్నాయి. గరిష్టంగా రూ.4,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. (image: OnePlus India)
2. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. అసలు ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.38,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఈ రెండు స్మార్ట్ఫోన్లకు 80వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఎండ్యూరెన్స్ ఎడిషన్ కొంటే రూ.43,999 చెల్లించాలి. ఫారెస్ట్ గ్రీన్, సియెరా బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: OnePlus India)
3. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో 8 బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు రూ.1,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. (image: OnePlus India)
4. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,245 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సిటీబ్యాంక్ క్రెడిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ.1,750 తగ్గింపు లభిస్తుంది. (image: OnePlus India)
5. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌పై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్స్‌తో వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.34,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.38,999 ధరకు, ఎండ్యూరెన్స్ ఎడిషన్‌ను రూ.39,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: OnePlus India)
6. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: OnePlus India)
7. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: OnePlus India)
8. వన్‌ప్లస్ 10ఆర్ స్మార్ట్‌ఫోన్ రెండు రకాల బ్యాటరీ కెపాసిటీలతో వేర్వేరు వేరియంట్స్ ఉన్నాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీకి 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, 4,500ఎంఏహెచ్ బ్యాటరీకి 150వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. (image: OnePlus India)