ఇటీవల భారత్ లో Nord 2T స్మార్ట్ ఫోన్ ను వన్ ప్లస్ విడుదల చేసింది. గత సంవత్సరం OnePlus Nord 2 హ్యాండ్సెట్ కు ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ రోజు జూలై 05న మధ్యాహ్నం 12 గంటకు అమెజాన్ వెబ్ సైట్ లో ఈ నార్డ్ 2టీ మొబైల్ విక్రయించనున్నారు. అంతే కాకుండా.. అమెజాన్ తో పాటు Nord 2T ఇతర OnePlus ఇండియా ఛానెల్ల ద్వారా కూడా ఇవి అందుబాటులో ఉండనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
OnePlus Nord 2T రెండు విభిన్న RAM మరియు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ,12జీబీ ర్యామ్ లతో 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ బేడ్ మోడల్ ధర రూ. 28,999గా ఉంది. టాప్ మెడల్ ధర రూ.33,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేది జెడ్ ఫాగ్, గ్రే షాడో కలర్ లో అందుబాటులో ఉండనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1500 వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. అంతే కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఈ తగ్గింపును మినహాయిస్తే.. బేస్ మోడల్ రూ.27,499, టాప్ మోడల్ రూ.32,499కు లభిస్తుంది. వన్ ప్లస్ ఇండియా సైట్ కూడా.. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐను అందిస్తుంది.