e-Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి శుభవార్త.. ఏకంగా 6 ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!
e-Scooter Offer: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి శుభవార్త.. ఏకంగా 6 ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!
Electric Scooter Offer | లోన్ తీసుకొని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు పొందొచ్చు.
Ola Scooter Offer | ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. పలు రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంచింది. మరీముఖ్యంగా లోన్ తీసుకొని ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.
2/ 8
ఓలా వివిధ రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తోంది. వీటిల్లో ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ అనే మూడు మోడళ్లు ఉన్నాయి. ఈ మూడు మోడళ్లపై ఇప్పుడు మనం ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
3/ 8
ఓలా స్కూటర్లపై ఈజీ లోన్ ఆఫర్లు లభిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు పొందొచ్చు. అంటే ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే లోన్ ద్వారా నచ్చిన ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇది చాలా మందికి ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
4/ 8
అలాగే తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందొచ్చు. ఓలా స్కూటర్లపై లోన్ వడ్డీ రేటు 2.2 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం మీరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. లోన్‌పై వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి.
5/ 8
అంతేకాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. కేవలం రూ. 999తోనే మీరు ఓలా స్కూటర్‌ను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇది ఓలా ఎస్1 ఎయిర్ మోడల్‌కు వర్తిస్తుంది. ఇలా కస్టమర్లకు మూడు రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.
6/ 8
ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. మీరు పాత టూవీలర్ ఇచ్చి కొత్త ఓలా స్కూటర్ కొంటే మీకు రూ. 10 వేల వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. పాత టూవీలర్ ఉన్న వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.
7/ 8
అలాగే క్రెడిట్ కార్డు డీల్ కూడా ఉంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్లు వారి క్రెడిట్ కార్డు ద్వారా ఓలా స్కూటర్ కొంటే రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ డీల్ కూడా కొంత కాలం వరకే ఉంటుందని గుర్తించుకోవలి.
8/ 8
అలాగే మరో ఆఫర్ కూడా ఉంది. ఓలా ఎస్1 ప్రో మోడల్‌పై అయితే రూ. 15 వేల వరకు తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. అందువల్ల మీరు ఇలా డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్ కూడా పరిమిత కాలం వరకే ఉంటుంది. జనవరి 29 వరకే ఈ డీల్ లభిస్తుంది.