యాపిల్ డివైజ్‌లు(Apple Devise) అంటేనే.. ప్రీమియం క్లాస్ వేరియంట్స్(Variants) అనేది అందరికీ తెలిసిందే. యాపిల్ ప్రొడక్ట్స్(Apple Products) ధర భారీగా ఉన్నా, వాటికి డిమాండ్(Demand) ఏమాత్రం తగ్గదు. అయితే వీటికోసం ఎక్కువ ధర చెల్లించలేని వారు అప్పుడప్పుడూ కంపెనీ(Company) ప్రకటించే ఆఫర్స్(Offers) కోసం వేచి చూస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పాయి ఈకామర్స్(E commerce) దిగ్గజాలు అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్(Flipkart). ఈ రెండు ప్లాట్‌ఫామ్స్‌లో యాపిల్ డివైజ్‌లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 (iPhone 12) ధర రూ.56,999 ఉండగా, అమెజాన్‌లో దీని ధర రూ.54,900గా ఉంది. 64GB వేరియంట్, బ్లూ కలర్ వేరియంట్ iPhone 12పై ఈ ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 12పై ఫ్లిప్‌కార్ట్ 13 శాతం ఆఫర్ ప్రకటించింది. దీంతో దీని ధర రూ.65,900 నుంచి రూ.56,999కి తగ్గింది. అయితే ఐఫోన్ 12పై అమెజాన్ 17 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
దీంతో దీని ధర రూ.65,900 నుంచి రూ.54,900కి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా కూడా యాపిల్ ఐఫోన్ 12ను కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ పోర్టల్ మీ పాత ఫోన్‌కు గరిష్టంగా రూ.13,000 ఎక్స్ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. అయితే ఈ మొత్తం ఎక్స్ఛేంజ్ చేస్తున్న డివైజ్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఈ ఎక్స్ఛేంచ్ ఆఫర్ అన్ని పిన్ కోడ్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. జిప్ కోడ్‌ను ఎంటర్ చేసి ఈ ఆఫర్‌ను మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇది మీ లొకేషన్లో అందుబాటులో ఉంటే.. ఫోన్ బ్రాండ్ పేరు, కొనుగోలు చేసిన సంవత్సరం, IMEI నంబర్‌ను అందించడం ద్వారా మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూను తనిఖీ చేయవచ్చు. అన్ని షరతులు పాటిస్తే.. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంచ్ వాల్యూ ఎంతో చూపిస్తుంది. ప్రస్తుత సేల్ ప్రైస్ నుంచి ఈ మొత్తాన్ని మైనస్ చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)