1. త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ప్రారంభం కానుంది. దసరా, దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ప్రతీ ఏటా ఈ సేల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తుంటాయి. ఇటీవల రిలీజైన నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. (image: Nothing)
2. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 ఎంత ధరకు కొనొచ్చో ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.28,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఆఫర్స్‌తో కలిపి తక్కువ ధరకే ఈ మొబైల్ కొనొచ్చు. సేల్ ప్రారంభం అయిన తర్వాత ఆఫర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. (image: Nothing)
3. నథింగ్ ఫోన్ 1 మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.32,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999. ఆ తర్వాత రూ.1,000 ధర పెరిగింది. దీంతో ప్రస్తుతం 8జీబీ+128జీబీ మోడల్ రూ.33,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.36,999 ధరకు, 12జీబీ+256జీబీ మోడల్ రూ.39,999 ధరకు లభిస్తోంది. (image: Nothing)
4. నథింగ్ ఫోన్ 1 రూ.30,000 లోపు రిలీజ్ అవుతుందని అంచనా వేశారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 1 బేస్ వేరియంట్‌ను ఆఫర్స్ అన్నీ కలిపి రూ.28,999 ధరకు కొనొచ్చు. ఈ లెక్కన నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 తగ్గింపు లభిస్తున్నట్టే. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.30,000 లోపు లభిస్తే కొనాలని ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి ఆఫర్. (image: Nothing)
5. నథింగ్ ఫోన్ 1 ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ముందు, వెనుక గ్లాస్ బాడీ, అల్యూమినియం ఫ్రేమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ మొబైల్లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ అందర్నీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 900 ఎల్ఈడీస్తో లైట్ స్ట్రిప్ ఉండటం విశేషం. (image: Nothing)
6. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (image: Nothing)
7. నథింగ్ ఫోన్ 1 మొబైల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి ఇందులో బ్లోట్‌వేర్, జంక్‌వేర్ ఉండదు, మూడేళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. వైట్, బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Nothing)