1. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) ప్రీ-ఆర్డర్స్ మొదలయ్యాయి. కేవలం రూ.2,000 చెల్లించి నథింగ్ ఫోన్ 1 బుక్ చేయొచ్చు. ప్రీ-ఆర్డర్ చేసినవారికి కొన్ని ఆఫర్స్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన తర్వాత ఈ మొబైల్ కొనడానికి ముందుగా అవకాశం లభిస్తుంది. జూలై 12న నథింగ్ ఫోన్ 1 రిలీజ్ అయిన తర్వాత మొబైల్ కొనకపోతే రీఫండ్ వస్తుంది. (image: Nothing)
2. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌పై ఇంతలా హైప్ రావడానికి పలు కారణాలున్నాయి. ఇండియాలో ప్రీమియం బ్రాండ్‌గా అడుగుపెట్టిన వన్‌ప్లస్ కో-ఫౌండర్ అయిన కార్ల్ పెయి, వన్‌ప్లస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నథింగ్ పేరుతో టెక్ బ్రాండ్ స్థాపించారు. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ వచ్చాయి. తొలి స్మార్ట్‌ఫోన్ రాబోతుండటంతో భారీ అంచనాలున్నాయి. నథింగ్ ఫోన్ 1 డిజైన్ ట్రాన్స్ఫరెంట్గా ఉండటం కూడా ఆకట్టుకుంటోంది. (image: Nothing)
3. నథింగ్ ఫోన్ 1 ధర ఎంత ఉంటుంది, ఫీచర్స్ ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ఫుల్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ఉండబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇండియాలో రూ.30,000 లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ లాంఛ్ ఆఫర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 బడ్జెట్లో లభిస్తే మిగతా బ్రాండ్స్‌కు గట్టి పోటీ తప్పదు. (image: Nothing)
4. ప్రస్తుతం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో కేవలం ఒకే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉంది. మోటోరోలా నుంచి మోటో ఎడ్జ్ 30 5జీ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌తో రిలీజైంది. మోటో ఎడ్జ్ 30 5జీ ధర రూ.27,999. ఇందులో 6.5 అంగుళాల pOLED డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫీచర్స్ ఇంకా తెలియాల్సి ఉంది. (image: Nothing)
5. నథింగ్ ఫోన్ 1 ఫీచర్స్ తెలియకపోయినా ప్రాసెసర్‌ని బట్టి రూ.30,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో రిలీజైన స్మార్ట్ఫోన్లు రూ.30,000 లోపే లభిస్తున్నాయి. కాబట్టి నథింగ్ ఫోన్ 1 కూడా ఇదే బడ్జెట్లో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 778జీ కన్నా స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ పెర్ఫామెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. (image: Nothing)
6. ఇప్పటికే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో ఇండియాలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లు చూస్తే వివో టీ1 ప్రో ధర రూ.23,999. ఐకూ జెడ్ 6 ప్రో ధర రూ.23,999. రియల్మీ 9 ఎస్ఈ ధర రూ.19,999. రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ధర రూ.25,999. సాంసంగ్ గెలాక్సీ ఏ73 ధర రూ.41,999. షావోమీ 11 లైట్ ఎన్ఈ ధర రూ.28,999. (ప్రతీకాత్మక చిత్రం)
7. దాదాపు అన్ని బ్రాండ్స్ నుంచి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఒక్క సాంసంగ్ మొబైల్ తప్ప ఇతర స్మార్ట్‌ఫోన్స్ అన్నీ రూ.30,000 లోపు ధరలోనే ఉన్నాయి. నథింగ్ బ్రాండ్ నుంచి రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1 కూడా ఇదే బడ్జెట్లో రిలీజ్ అయితే ఈ కంపెనీలకు గట్టి పోటీ తప్పదు. (image: Nothing)