1. ప్రతీ ఏటా దసరా, దీపావళి సందర్భంగా ఇ-కామర్స్ సైట్లల్లో మొబైల్స్ తక్కువ ధరకే లభిస్తుంటాయి. అలాంటి ఆఫర్స్ మళ్లీ మళ్లీ రావు. అందుకే కొన్ని నెలలు వెయిట్ చేసి మరీ దసరా, దీపావళి సేల్‌లో స్మార్ట్ఫోన్లు కొంటుంటారు. కొన్ని సందర్భాల్లో సేల్ కన్నా తక్కువ ధరకే మొబైల్స్ కొనే అవకాశం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ సేల్ ధరకే లభిస్తోంది. దసరా దీపావళి సేల్ కన్నా ముందు నథింగ్ ఫోన్ 1 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధరకు, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.36,999 ధరకు, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.38,999 ధరకు అమ్ముడుపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, బిగ్ దివాళీ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.30,000 లోపే నథింగ్ ఫోన్ 1 కొనే ఛాన్స్ లభించింది. ఇప్పుడు కూడా సేల్ ధరకే నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ప్రస్తుత ధరలు చూస్తే 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.29,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.32,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.35,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1 మొబైల్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సిటీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ రూ.6,000 నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.18,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. నథింగ్ ఫోన్ 1 ప్రత్యేకతలు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రధాన ఆకర్షణ. స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 900 ఎల్ఈడీస్తో ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఉంటుంది. కాల్స్, సిగ్నల్స్, ఛార్జింగ్ స్టేటస్ ఈ లైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోటోలు క్లిక్ చేసేప్పుడు ఫ్లాష్ లైట్‌గా ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంటే నోటిఫికేషన్స్, కాల్స్ వచ్చినప్పుడు ఈ లైట్స్ ద్వారా తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. నథింగ్ ఫోన్ 1 ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + నథింగ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో బ్లోట్‌వేర్ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. నథింగ్ ఫోన్ 1 కెమెరా ఫీచర్స్ చూస్తే 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ Samsung JN1 సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఫ్రంట్ కెమెరా ఉంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 15వాట్ వైర్‌లైస్ ఛార్జింగ్, 5వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)