1. యూకే బేస్డ్ టెక్ కంపెనీ నథింగ్ (Nothing) ఆడియో ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఆల్రెడీ ప్రవేశించింది. నథింగ్ ఇయర్ 1 ఇయర్‌ఫోన్స్‌తో ఈ కంపెనీ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. కాగా బుధవారం నాడు ప్రపంచవ్యాప్తంగా కొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 'ఇయర్ స్టిక్ (Nothing Ear stick)'ను కంపెనీ లాంచ్ చేసింది. (image: Nothing)
2. ఈ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌తో కంపెనీ రెండవ ఆడియో ప్రొటెక్ట్ తీసుకొచ్చినట్లయింది. నథింగ్ ఇయర్ స్టిక్ TWS ఇయర్‌బడ్స్ ఇండియాలో నవంబర్ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్, మింత్రా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఈ బడ్స్ ధరను రూ.8,499గా కంపెనీ నిర్ణయించింది. నథింగ్ ఇయర్ స్టిక్ ఫీచర్స్ తెలుసుకోండి. (image: Nothing)
3. నథింగ్ ఇయర్ స్టిక్ ఫీచర్స్ చూస్తే ఇందులో హాఫ్-ఇన్-ఇయర్ డిజైన్‌తో వచ్చే ఈ బడ్స్‌లో 12.6 మిమీ డ్రైవర్లు అందించారు. ఒకే ఛార్జ్‌పై 7 గంటల ప్లేబ్యాక్ ఆఫర్ చేసే ఇవి ఛార్జింగ్ కేస్‌తో సహా మొత్తం 29 గంటల బ్యాటరీ లైఫ్‌ని అందిస్తాయి. కేస్ 10 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ కేస్ 350mAh బ్యాటరీతో వస్తుండగా.. ఒక్కో ఇయర్‌బడ్ 36mAh బ్యాటరీతో రానున్నాయి. (image: Nothing)
4. ఈ కొత్త ఇయర్ (స్టిక్) వైర్లెస్ ఇయర్‌బడ్స్ ట్రాన్స్పరెంట్ కేస్‌తో వస్తాయి. మీరు బడ్స్ పొందడానికి ఒక ట్విస్ట్ తో కేసును ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసు లిప్‌స్టిక్ లేదా సిలిండర్ రూపంలో ఉంటుంది. ఇందులోని ఛార్జింగ్ కేస్ ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ను పొందుతుంది. IP54 రేటింగ్‌తో ఇవి వాటర్, స్వేట్ ప్రూఫ్‌గా పనిచేస్తాయి. (image: Nothing)
5. గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఈ ఇయర్ స్టిక్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఆడియో ప్లే/పాజ్, వాల్యూమ్ కంట్రోల్, కాల్స్, వాయిస్ అసిస్టెంట్‌ని కంట్రోల్ చేసేందుకు వీలుగా ఇందులో గెస్చర్ కంట్రోల్ కూడా కంపెనీ ఆఫర్ చేసింది. (image: Nothing)
6. ఈ ప్రీమియం ఇయర్ (స్టిక్)లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేకపోవడం గమనార్హం. కాగా విండ్, క్రౌడ్ ప్రూఫ్ కాల్ల కోసం ప్రతి ఇయర్బడ్లోని 3 మైక్రోఫోన్లను ఉపయోగించుకునే క్లియర్ వాయిస్ టెక్నాలజీని కంపెనీ అందించింది. యూజర్ పరిసరాలకు బేస్‌ను డైనమిక్‌గా అడ్జస్ట్ చేసే బేస్ లాక్ కూడా వీటిలో ఆఫర్ చేసింది. (image: Nothing)
7. నథింగ్ ఫోన్ (1)తో పెయిర్ చేసినప్పుడు EQ సెట్టింగ్స్ అడ్జస్ట్మెంట్, ఫైండ్ మై ఇయర్‌బడ్స్ ఫంక్షన్‌తో సహా అనేక స్పెషల్ ఫీచర్లు పొందొచ్చు. ఇతర ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో పైన పేర్కొన్న ఫీచర్లను యాక్సెస్ చేయడానికి నథింగ్ X యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. వీటిలో సిలికాన్ బడ్స్ ఇవ్వకపోవడం ఒక మైనస్ అని చెప్పవచ్చు. నథింగ్ షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం, ఇయర్‌బడ్స్ వైట్ & రెడ్ కలర్ ఆప్షన్లలో వస్తాయని తెలుస్తోంది. (image: Nothing)