1. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కాలం గడుస్తున్న కొద్దీ తగ్గుతుంటాయి. కానీ నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్ (Nothing Ear 1 Earbuds) ధర ఊహించని రీతిలో పెరిగింది. కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన ఈ వైర్లెస్ ఇయర్‌బడ్స్ ప్రైస్ ఇప్పుడు భారీగా పెరిగిపోయింది. అక్టోబర్ 26 నుంచి ఇయర్ (1)ని 149 డాలర్లకు విక్రయించనున్నట్లు నథింగ్ CEO కార్ల్ పీ రీసెంట్గా ఒక ట్వీట్ చేశారు. (image: Nothing)
2. అతను పేర్కొన్న తేదీకి ఇంకా ఆరు రోజుల సమయం ఉన్నప్పటికీ.. బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో నథింగ్ ఇయర్ (1) TWS ఇయర్‌బడ్‌ల ధరను పెంచింది. కంపెనీ నథింగ్ ఇయర్ (1) ఇయర్ బడ్స్‌ను ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్ముతోంది. ఖర్చులు పెరగడం వల్ల అక్టోబర్ 26 నుంచి ఇయర్ (1) ధరలను 149 డాలర్ల (సుమారు రూ.12,200) వరకు పెంచుతామని నథింగ్ సీఈఓ ప్రకటించారు. నథింగ్ ఇయర్ (1) 15 కంటే ఎక్కువ OTA అప్డేట్లతో ఇప్పుడొక పూర్తి భిన్నమైన ప్రొడక్ట్‌గా మారిందన్నారు. (image: Nothing)
3. నథింగ్ ఇయర్ (1) వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 2021, జూన్ నెలలో వైట్ కలర్ వేరియంట్ రూ.5,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అవే ఇయర్‌బడ్స్ ధర రూ.7,299కి పెరిగింది. బ్లాక్ కలర్ మోడల్ రూ.6,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడది సైట్లో రూ.8,499 ధరకు అందుబాటులో ఉంది. (image: Nothing)
4. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆరు లక్షల వరకు నథింగ్ ఇయర్ (1) యూనిట్లను విక్రయించింది. కార్ల్ పేర్కొన్న ధర, ఫ్లిప్‌కార్ట్ లిస్ట్ చూపే దానికంటే చాలా ఎక్కువగానే ఉంది. దీన్నిబట్టి, కంపెనీ ఇయర్‌బడ్స్ ధరను మళ్లీ పెంచవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి పెంచినా కూడా దీని ధర రూ.10,000 లోపు ఉంచవచ్చని అంచనా. (image: Nothing)
5. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన పౌండ్ స్టెర్లింగ్, కంపెనీకి పెరిగిన ఖర్చులు, ఇతర కారణాల వల్ల ఈ ఇయర్‌బడ్స్ ధరలు పెరిగాయని తెలుస్తోంది. ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో వచ్చే నథింగ్ ఇయర్ (1) వైర్లెస్ ఇయర్‌బడ్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, క్లియర్ వాయిస్ టెక్నాలజీ, 5.7 గంటల బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ కేస్‌తో 34 గంటల బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. (image: Nothing)
6. కంపెనీ వివరాల ప్రకారం, ఈ ఇయర్‌బడ్స్ 10 నిమిషాల ఛార్జ్‌తో మొత్తం 8 గంటల లిజనింగ్ టైమ్‌ని ఆఫర్ చేస్తాయి. కొత్త నథింగ్ ఇయర్ (స్టిక్) TWS ఇయర్‌బడ్స్ లాంచ్ అక్టోబర్ 26న లాంచ్ కానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌లో లిప్‌స్టిక్ ఆకారపు ఛార్జింగ్ కేస్ ఉంటుంది. ఇవి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడానికి చాలా పోర్టబుల్‌గా ఉంటాయి. (image: Nothing)