3. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఇయర్ 1 యూనిట్స్ మొత్తం అమ్ముడుపోయాయని, తమ కంపెనీ మొదటి ప్రొడక్ట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని, నథింగ్ ఫ్యాన్స్ ఇయర్ 1 ప్రొడక్ట్‌కి బదులు నథింగ్ ఇయర్ స్టిక్ కొనాలని మను శర్మ ట్వీట్ చేశారు. నథింగ్ నుంచి రెండో ఇయర్‌బడ్స్ ఇయర్ స్టిక్ పేరుతో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. (image: Nothing)
4. నథింగ్ నుంచి మొత్తం మూడు ప్రొడక్ట్స్ లాంఛ్ అయ్యాయి. గతేడాది నథింగ్ ఇయర్ 1 లాంఛ్ కాగా, ఈ ఏడాది నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చాయి. నథింగ్ ఇయర్ స్టిక్ ధర రూ.8,499. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. నథింగ్ ఇయర్ 1 రూ.6,999 ధరకు రిలీజైన సంగతి తెలిసిందే. నథింగ్ ఇయర్ స్టిక్ కొనడానికి రూ.1,500 ఎక్కువ ఖర్చు చేయాలి. (image: Nothing)
5. నథింగ్ ఇయర్ స్టిక్ ఫీచర్స్ చూస్తే నథింగ్ ఇయర్ 1, నథింగ్ ఫోన్ 1 లాగే ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో తీసుకొచ్చింది కంపెనీ. ఇది చూడ్డానికి లిప్‌స్టిక్‌లా ఉంటుంది. ట్విస్ట్ చేసి కేస్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నథింగ్ ఇయర్ స్టిక్ ఈ కంపెనీ నుంచి వచ్చిన రెండో ఆడియో ప్రొడక్ట్. హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్‌తో ఈ ఇయర్ బడ్స్ని తయారు చేసింది కంపెనీ. ఇందులో 12.6 మిమీ డ్రైవర్లు ఉన్నాయి. (image: Nothing)
6. నథింగ్ ఇయర్ స్టిక్ కేస్‌లో 350mAh బ్యాటరీ, ఒక్కో ఇయర్‌బడ్‌లో 36mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 గంటల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 29 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఛార్జింగ్ కేస్‌ను 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 2 గంటల పాటు వాడుకోవచ్చు. టైప్ సీ పోర్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. IP54 రేటింగ్ ఉంది. వాటర్ ప్రూఫ్, స్వేట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. (image: Nothing)
7. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు ఉపయోగించుకోవచ్చు. గెస్చర్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఆడియో ప్లే, ఆడియో పాజ్, వాల్యూమ్ కంట్రోల్, కాల్స్, వాయిస్ అసిస్టెంట్ కోసం ఈ ఫీచర్ వాడుకోవచ్చు. (image: Nothing)
8. నథింగ్ ఇయర్ స్టిక్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ లేదు. క్లియర్ వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది నథింగ్. పెయిర్ చేసినప్పుడు EQ సెట్టింగ్స్ అడ్జస్ట్మెంట్, ఫైండ్ మై ఇయర్‌బడ్స్ ఫంక్షన్ లాంటి స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. నథింగ్ X యాప్ ద్వారా ఇయర్ స్టిక్ ఆపరేట్ చేయొచ్చు. (image: Nothing)