Nokia X30 5G: రూ.42,000 ఫోన్ రూ.2 వేలకే.. నోకియా రెంటల్ సర్వీసులు!
Nokia X30 5G: రూ.42,000 ఫోన్ రూ.2 వేలకే.. నోకియా రెంటల్ సర్వీసులు!
Nokia Phones | కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. నోకియా ఫోన్ రెంటల్ సర్వీసులు తీసుకువచ్చింది. నెలకు రూ.2 వేలు చెల్లిస్తే చాలు.. రూ.42 వేల ఫోన్ వాడుకోవచ్చు.
5G Smartphones | నోకియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నోకియా అదే పెద్ద బ్రాండ్. ఒకప్పుడు మన దేశంలో నోకియా ఫోన్లకు ఉన్న డిమాండ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చైనా కంపెనీల ధాటికి నోకియా నిలబడలేకపోయిందనేది వాస్తవ అంశం.
2/ 10
ఇప్పటికీ కూడా నోకియా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది నోకియా ఫోన్లు వాడుతున్నారు. ఇటీవలనే కంపెనీ ఫ్లిప్ టైప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు నోకియా గురించి ఎందుకని అనుకుంటున్నారా?
3/ 10
అక్కడికే వస్తున్నాను. నోకియా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఎకో ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ నోకియా ఎక్స్30 5జీ ఫోన్‌ను కంపెనీ అద్దెకు ఇస్తోంది. అంటే నోకియా రెంటల్ సర్వీసులు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
4/ 10
నోకియా ఎక్స్30 5జీ ఫోన్‌కు కేస్, ప్యాకేజింగ్ వంటివి రీసైకిల్డ్ మెటీరియల్ నుంచి తయారు చేశారు. ఈ ఫోన్లో 6.43 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని రేటు 520 డాలర్లు.
5/ 10
మన కరెన్సీలో చెప్పుకుంటే ఈ నోకియా ఫోన్ రేటు దాదాపు రూ. 42,500 వరకు ఉండొచ్చు. అయితే దీన్ని నెలకు 25 డాలర్లు చెల్లించి రెంటల్ సర్వీస్ ద్వారా కూడా పొందొచ్చు. అంటే నెలకు దాదాపు రూ.2 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
6/ 10
అయితే నోకియా ఎక్స్30 5జీ ఫోన్‌ను రెంట్‌కు తీసుకునే వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. కనీసం మూడు నెలల పాటు ఫోన్‌ను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది.
7/ 10
రెంట్‌కు తీసుకున్న కాలంలో ఫోన్‌కు ఏమైనా డ్యామేజ్ అయినా, లేదంటే రిపేర్ వచ్చినా.. కంపెనీయే ఫోన్‌ను బాగు చేయిస్తుంది. అంటే ఫోన్ రెంట్‌కు తీసుకున్న వారికి సర్వీస్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు.
8/ 10
నోకియా త్వరలోనే ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి కూడా తీసుకురాబోతోంది. అంటే కంపెనీ ఇండియాలో కూడా ఇలాంటి ఆఫర్‌ను అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.
ఈ ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుంది. 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా ఫేస్ అన్‌లాక్, ఇసిమ్, ఎఫ్ఎఫ్సీ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం బ్లూ రంగులో మాత్రమే అందుబాటులో ఉంది.