1. నోకియా ఇటీవల ఇండియాలో మరో రెండు స్మార్ట్ఫోన్లను, రెండు ఫీచర్ ఫోన్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో నోకియా 5.3 మోడల్ ఒకటి. అమెజాన్‌లో సేల్ ప్రారంభమైంది. (image: Nokia India)
2/ 10
2. నోకియా 5.3 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.55 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. (image: Nokia India)
3/ 10
3. నోకియా 5.3 రియర్ కెమెరా 13+2+5+2 మెగాపిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Nokia India)
4/ 10
4. నోకియా 5.3 బ్యాటరీ 4000ఎంఏహెచ్. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. అంటే ఇందులో గూగుల్ యాప్స్ తప్ప ఇతర ఇన్ బిల్ట్ యాప్స్ ఏవీ ఉండవు. (image: Nokia India)
5/ 10
5. నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ డ్యూయెల్ సిమ్+ఎస్డీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. (image: Nokia India)
6/ 10
6. నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ చార్కోల్, సియాన్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Nokia India)
7/ 10
7. నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,499.
8/ 10
8. అమెజాన్‌లో హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డుతో కొన్నవారికి 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. (image: Nokia India)
9/ 10
9. ఒకప్పుడు ఫీచర్ ఫోన్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన నోకియా... స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చతికిలబడింది. సాంసంగ్‌తో పాటు షావోమీ, రియల్మీ, ఒప్పో, వివో, మోటోరోలా లాంటి కంపెనీల దూకుడును తట్టుకోలేకపోయింది. (image: Nokia India)
10/ 10
10. ఇటీవల నోకియా తన స్మార్ట్‌ఫోన్ లైనప్‌పై ఎక్కువగా దృష్టిపెట్టింది. ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొత్తకొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. (image: Nokia India)