1. నోకియా ఇండియా ఇటీవల భారతదేశంలో మరో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజ్ చేసింది. ఈ మొబైల్ ధర కేవలం రూ.5,999 మాత్రమే. నోకియా సీ12 (Nokia C12) మోడల్‌ను ఇండియాలో పరిచయం చేసింది. ఇది ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Nokia India)
2. ఇందులో హెచ్డీ+ డిస్ప్లే, 2జీబీ అడిషనల్ ర్యామ్, భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మొబైల్‌పై ఒక ఏడాది రీప్లేస్మెంట్ గ్యారెంటీ ప్రకటించడం విశేషం. ఇప్పటికే నోకియా నుంచి రూ.5,499 ధరలో ఓ బడ్జెట్ మొబైల్ (Budget Mobile) లాంఛ్ అయింది. ఇప్పుడు రూ.5,999 ధరలో నోకియా సీ12 రిలీజ్ చేయడం విశేషం. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి. (image: Nokia India)
5. ఇందులో Unisoc 9863A1 ప్రాసెసర్ ఉంది. ఇన్‌బిల్ట్ 2జీబీ ర్యామ్ ఉండగా, అదనంగా మరో 2జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. మొత్తం 4జీబీ ర్యామ్ ఉపయోగించుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 3,000ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. (image: Nokia India)
7. గతంలో నోకియా సీ01 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కూడా రూ.5,999 ధరకే రిలీజైంది. ఇప్పుడు ఈ మొబైల్ రూ.5,499 ధరకు లభిస్తోంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, యునిసోక్ SC9863a ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 5మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Nokia India)