1. ఇండియాలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ హవా కొనసాగుతున్నా ఇప్పటికీ ఫీచర్ ఫోన్ (Feature Phone) కొనేవారు ఉన్నారు. ఒకప్పుడు ఫీచర్ మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించిన నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్ వచ్చేసింది. నోకియా 8210 4జీ (Nokia 8210 4G) మోడల్ ఇండియాలో లాంఛ్ అయింది. క్యాండీ బార్ ఫార్మాట్లో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది హెచ్ఎండీ గ్లోబల్. (image: Nokia India)
2. నోకియా 8210 4జీ ఫోన్ ధర రూ.3,999. కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. రెడ్, డార్క్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్ ఇండియా, నోకియా ఇండియా అధికారిక స్టోర్లలో కొనొచ్చు. అమెజాన్‌లో కొంటే 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇప్పటికే ఇతర బ్రాండ్ల నుంచి ఫీచర్ ఫోన్లు ఉన్నాయి. వీటికి నోకియా 8210 4జీ గట్టి పోటీ ఇవ్వనుంది. (image: Nokia India)
3. నోకియా 8210 4జీ ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ సిమ్ స్లాట్స్ ఉంటాయి. రెండు సిమ్ కార్డులు ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూనిసోక్ టీ107 ప్రాసెసర్ ఉంది. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 48ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మెమొరీ కార్డుతో 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. (image: Nokia India)
5. నోకియా 8210 4జీ ఫోన్లో 1,450ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 27 రోజుల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇతర ఫీచర్స్ చూస్తే టార్చ్, గేమ్‌లాఫ్ట్ నుంచి స్నేక్, టెట్రిస్, బ్లాక్‌జాక్, యారో మాస్టర్, ఎయిర్ స్ట్రైక్, నింజాఅప్ లాంటి గేమ్స్, నోకియా నుంచి రేసింగ్ అటాక్ - మల్టీప్లేయర్, డూడుల్ జంప్, క్రాసీ రోడ్, ఇంగ్లీష్ విత్ ఆక్స్ఫర్డ్ లాంటి గేమ్స్ కూడా ఉంటాయి. (image: Nokia India)
6. ఇక ఇటీవల మరో క్లాసిక్ ఫోన్ నోకియా 2600 ఫ్లిప్ ఇండియాలో రిలీజైంది. ఈ ఫోన్ ధర రూ.4,699. ఇందులో 2.8 అంగుళాల QVGA ప్రైమరీ స్క్రీన్ ఉంటే, 1.77 అంగుళాల QQVGA సెకండరీ స్క్రీన్, Unisoc T107 ప్రాసెసర్, 48ఎంబీ ర్యామ్ + 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, 1450ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Nokia India)
7. ఇక నోకియా నుంచి చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే నోకియా సీ01 ప్లస్ మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర రూ.6,299. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. ఇందులో 5.45 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, యునిసోక్ SC9863a ప్రాసెసర్, 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకునే ఆప్షన్, 5మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. (image: Nokia India)