1. ఒకప్పుడు ఫీచర్ ఫోన్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన నోకియా... ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటోంది. ఇటీవల సరికొత్త కాన్సెప్ట్‌తో ఫీచర్ ఫోన్ లాంఛ్ చేసి మొబైల్ మార్కెట్‌ను ఆశ్చర్యపర్చింది. లేటెస్ట్గా నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో (Nokia 5710 XpressAudio) ఫీచర్ ఫోన్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంఛ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. (image: Nokia India)
2. ఈ మొబైల్ ఇండియాలో కూడా లాంఛ్ అయింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే ఫోన్లోనే బిల్ట్ ఇన్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ (Wireless Earbuds) వస్తాయి. అంటే పాటలు వినాలనుకున్నప్పుడు, కాల్స్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ నుంచి వైర్లెస్ ఇయర్‌బడ్స్ తీసుకుంటే చాలు. అంటే ప్రత్యేకంగా వైర్లెస్ ఇయర్‌బడ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. (image: Nokia India)
4. నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫీచర్స్ చూస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇన్‌బిల్ట్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ గురించే. ఫోన్లో వెనుకవైపు పైన వైర్లెస్ ఇయర్‌బడ్స్ ఉంటాయి. ఛార్జింగ్ కేస్ కూడా అక్కడే ఉంటుంది. స్లైడర్ కిందకు జరిపి ఇయర్‌బడ్స్ బయటకు తీయొచ్చు. డెడికేటెడ్ మ్యూజిక్ బటన్స్, ఇన్‌బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, వైర్లెస్ ఎఫ్ఎం రేడియో లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. (image: Nokia India)
5. నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫీచర్ ఫోన్ Unisoc T107 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మెమొరీ కార్డుతో 32జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. స్నేక్, టెట్రిస్, బ్లాక్‌జాక్, యారో మాస్టర్, ఎయిర్ స్ట్రైక్, నింజా అప్, రేసింగ్ ఎటాక్ లాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. (image: Nokia India)
6. నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫీచర్ ఫోన్లో 1,450ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 31రోజుల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. 4G VoLTE నెట్వర్క్ సపోర్ట్ ఉంది. ఇందులో 2.4 అంగుళాల QVGA డిస్ప్లే ఉంది. న్యూమరిక్, ఫంక్షన్ కీస్ లభిస్తాయి. బ్లూటూత్ 5.0, మైక్రో యూఎస్బీ పోర్ట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. వెనుకవైపు ఫ్లాష్‌తో 0.3 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. (image: Nokia India)
7. ఇటీవల నోకియా నుంచి ఇండియాలో నోకియా 2600 ఫ్లిప్ ఫీచర్ ఫోన్ రూ.4,699 ధరకు, నోకియా 8210 4జీ ఫోన్ రూ.3,999 ధరకు రిలీజైంది. తక్కువ ధరలో లభిస్తున్న ఫీచర్ ఫోన్లు ఇవే. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫీచర్ ఫోన్లకు పోటీ ఇస్తున్నాయి ఈ మొబైల్స్. ఇప్పుడు లేటెస్ట్గా రిలీజైన నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఆకట్టుకుంటోంది. (image: Nokia India)