ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5kW (48V), 1.5kW (60W), డ్యూయల్ బ్యాటరీ 3kW (48V)తో లభిస్తుంది. మీరు ఎంచుకొనే బ్యాటరీ బట్టి రేటు మారుతుంది. NIJ Accelero+లో మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం.. ఎకో మోడ్‌లో 190 కి.మీ. రేంజ్ వస్తుంది. ఇది ఓలా ఎస్1 రేంజ్ 181 కంటే ఎక్కువ. ఇక నగరాల్లో అయితే 120 కి.మీ. వరకు వెళ్లొచ్చు.
లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ను 3A పవర్ సాకెట్లో ప్లగ్ చేసి చార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 6 నుంచి 8 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ను 6A సాకెట్‌లోకి ప్లగ్ చేసి.. 3 నుంచి 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఐతే ఇందులో వాడిన సింగిల్ బ్రష్‌లెస్ DC మోటార్ పవర్ లేదా టార్క్ వివరాలను మాత్రం NIJ వెల్లడించలేదు.