గూగుల్ కంపెనీ బుధవారం ‘Google IO 2022 కీనోట్’ పేరుతో ఒక ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు కొత్త డివైజ్‌లను గూగుల్ ఆవిష్కరించింది. పాత ఫీచర్లకు కొత్త అప్డేట్స్ను కూడా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది వినియోగదారులు ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ (Google Maps) కోసం కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇమ్మర్సివ్ వ్యూ, ఫ్యూయల్ ఎఫీషియెంట్ రూట్ గుర్తించడం, థర్డ్ పార్టీ యాప్‌లలో లైవ్ వ్యూని ఉపయోగించడం.. వంటి ఫీచర్లను ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్త ఇమ్మర్సివ్ వ్యూ (Immersive view) అప్డేట్ ద్వారా.. లోకల్ ఫిజికల్ ప్రీసెట్ చేయకుండానే పరిసరాలు, ల్యాండ్‌మార్క్, రెస్టారెంట్ లేదా ఏదైనా స్పాట్ వంటివి ఎలా ఉంటాయో యూజర్లు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్లేవారికి, స్థానికంగా ఉండే హిడెన్ లొకేషన్స్ వెలికి తీయడానికి, ఎక్కువ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఫీచర్ సాయం చేస్తుందని గూగుల్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఉదాహరణకు.. మీరు లండన్‌కు విహారయాత్ర ప్లాన్ చేస్తుంటే.. అక్కడ చూడటానికి బెస్ట్ స్పాట్స్, మంచి ఫుడ్ లభించే లొకేషన్స్ చూడాలనుకుంటారు. అయితే ఇంట్లోనే కూర్చొని లొకేషన్ సెర్చ్ చేస్తూ.. వర్చువల్‌గా ఆ స్పాట్‌కు వెళ్లి, చూస్తున్న ఎక్స్‌పీరియన్స్‌ను గూగుల్ మ్యాప్స్ అందిస్తుంది. దీంతోపాటు టైమ్ స్లయిడర్ సహాయంతో.. ఏదైనా రోజులోని వివిధ సమయాల్లో, వివిధ వాతావరణ పరిస్థితులలో ఆ స్పాట్ ఎలా ఉంటుందో వినియోగదారులకు చూపిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ టెక్ దిగ్గజం US, కెనడాలో ఎకో ఫ్రెండ్లీ రూటింగ్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీని ద్వారా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మ్యాప్స్‌లో స్పెషల్ రూట్ చూపిస్తుంది. ఇంధనం తక్కువగా ఖర్చయ్యే ‘మోస్ట్ ఫ్యూయెల్- ఎఫీషియెంట్ రూట్’ను (Fuel efficient route) సూచిస్తుంది. ఈ ఫీచర్‌ను ఐరోపాతో పాటు మరిన్ని ప్రదేశాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
వీటితో పాటు గూగుల్ మ్యాప్స్‌లో ‘లైవ్ వ్యూ’ (Live View) ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. నడుచుకుంటూ వేళ్లే వినియోగదారులు తమ రూట్‌ను కనుగొనడంలో ఈ ఫీచర్ AR టెక్నాలజీని ఉపయోగిస్తూ సహాయపడుతుంది. విమానాశ్రయాలు, మాల్స్, రైల్వే స్టేషన్లు వంటి ఇండోర్ ఏరియాలలో నావిగేషన్ కోసం ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. (ప్రతీకాత్మక చిత్రం)