* ప్లాన్స్ ధరలు మారిన దేశాలు : గత ఏడాది కాలంగా ఓటీటీ స్ట్రీమింగ్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. దీనికితోడు కొవిడ్ తర్వాత చాలామంది తమ ఖర్చులను తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 190 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న నెట్‌ఫ్లిక్స్ 5% మార్కెట్‌ను కోల్పోయింది. ఎమెన్, జోర్డాన్, లిబియా, ఇరాన్ వంటి దేశాలతో సహా మధ్య-ప్రాచ్య దేశాల్లో తగ్గించింది.
కెన్యా, సబ్ సహారా ఆఫ్రికన్ మార్కెట్లు, యూరోపియన్ దేశాలు క్రొయేషియా, స్లోవేనియా, బల్గేరియా, ఆసియాలోని మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్‌ల్లో ధరలు తగ్గించింది. లాటిన్ అమెరికా, వెనిజులా, ఈక్వెడార్ తదితర దేశాల్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఖరీదు తగ్గించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మొరాకాలో బేసిక్ ప్లాన్‌ను 65 దిర్హామ్‌ల నుంచి 35 దిర్హామ్‌లకు తగ్గించారు.
అలాగే స్టాండర్డ్ ప్లాన్‌ను 95 దిర్హామ్‌ల నుంచి 65కు, ప్రీమియం ప్లాన్‌ను 95 దిర్హామ్‌లకు తగ్గిస్తూ నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకోగా, ఆయా దేశాల్లో పరిస్థితులను బట్టి సగానికి పైగా తగ్గించినట్లు జర్నల్ తెలిపింది. ఇలా తగ్గించడం ఇదే మొదటిసారి కాదు, 2021లో ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్ తన సబ్స్క్రిప్షన్ ధరలను 16% నుంచి 20% వరకు తగ్గించింది. యూఎస్, కెనాడాలోని మార్కెట్లు సంతృప్తికరంగా ఉండటంతో అక్కడ తమ వాటా పెంచుకునేందుకు చూస్తోంది.
* వ్యూహాత్మక అడుగులు : ప్రస్తుత పోటీ నేపథ్యంలో కంపెనీలు కొన్ని కీలక నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంటుందని వాల్‌స్ట్రీట్ సూచిస్తోంది. 2022లో కంపెనీ చందాదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2022 చివరి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆదాయం $11.49 మేర తగ్గినట్లు తన నివేదికలో పేర్కొంది. దీన్ని అధిగమించి సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు అకౌంట్, పాస్వర్డ్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయాలని అనుకుంటోంది.
ప్రపంచంలో 100 మిలియన్ల మంది పక్కవాళ్ల అకౌంట్ ఉపయోగిస్తున్నట్లు అంచనా వేసింది. పాస్వర్డ్ షేరింగ్‌ను నియంత్రించడం, యాడ్ సపోర్టడ్ ప్లాన్‌ను లాంచ్ చేసేందుకు చూస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. తమ కంపెనీ వినియోగదారుల సంఖ్య పెంచేందుకు నిర్దేశిత దేశాల్లో తమ ప్లాన్ ధరలు తగ్గించడం, అప్డేట్ చేస్తున్నట్లు నిర్ధారించారు.