Asteroid: విశ్వంలో గ్రహశకలాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎక్కడి నుంచో భూమి వైపు, లేదంటే భూమి పక్క నుంచి దూసుకొచ్చేస్తుంటాయి. వీటి గమనాన్ని, ప్రత్యేకతలను అంతరిక్ష పరిశోధకులు ఆసక్తికరంగా విశ్లేషిస్తుంటారు. ఒకవేళ భూమిపైకి గ్రహశకలం వస్తే ఏం చేయాలి అనేది వాటి ద్వారానే పరిశీలిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
NASA Asteroid : కరోనాతో టెన్షన్ పడుతున్న సమయంలో... మానవాళికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) ఓ చేదు విషయం చెప్పింది. ఓ భారీ గ్రహశకలం జూన్ 6న భూమివైపు వస్తోందట. ఇది చిన్న గ్రహశకలం కాదు. దీని పరిమాణం 800 నుంచి 1800 అడుగుల దాకా ఉండొచ్చంటున్నారు. దీన్ని పొటెన్షియల్లీ డేంజరస్ కేటగిరీలో చేర్చింది నాసా. భూమికి ప్రమాదకరం అని భావించే గ్రహశకలాల్ని మాత్రమే ఈ జాబితాలో నాసా చేర్చుతుంది. గత నెల్లో వచ్చిన రెండు భారీ గ్రహశకలాల్ని కూడా ఇదే లిస్టులో నాసా చేర్చింది.
తాజాగా ఇలా ఓ గ్రహ శకలం భూమిని దాటుకుంటూ వెళ్లిపోతుందని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)కి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు దానికి ‘2008 గో20’ అని పేరు కూడా పెట్టారు. ఇది భూమి వైపు గంటలకు 18 వేల మైళ్ల వేగంతో దూసుకొస్తోందట. అయితే దీని వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇది భూమిని దాటుకొని వెళ్లిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నాసా దీనిని అపోలో క్లాస్ గ్రహశకలంగా గురించింది. ఈ గ్రహ శకలం జులై 24న భూమిని దాటుకొని వెళ్లిపోతుంది. ఇది ఓ పెద్ద స్టేడియం అంత పరిమాణంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మూడు తాజ్ మహల్స్ అంత పెద్దగా ఉంటుంది. ఇది భూ గ్రహం దగ్గర నుంచి వెళ్లిపోతుంది. ఆ సమయంలో రెండింటి మధ్య దూరం 0.04 ఆస్ట్రోనామికల్ యూనిట్లుగా ఉంటుంది. మన లెక్కల ప్రకారం చెప్పాలంటే 37,18,232 మైల్స్ దూరం. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే... చంద్రుడు మనకు 2,38,606 మైళ్ల దూరంలో ఉన్నాడు. అంటే... మనకు చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి సుమారు 17 రెట్లు ఎక్కువ అన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)
2008 గో2- గ్రహశకలం భూమికి గరిష్ఠంగా 26,05,509 మైళ్ల దగ్గరకు వచ్చే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంత దగ్గరగా రావడం వల్ల ఆ గ్రహ శకలాన్ని ‘క్లోజ్ ఆబ్జెక్ట్’గా చూడొచ్చు అని వారు చెబుతున్నారు. సౌరకుటుంబంలో జరిగే మార్పుల వల్ల ఏర్పడ్డ రాతి అవశేషాలు, పదార్థాలు కలసి గ్రహశకలాలు ఏర్పడుతుంటాయి. 4.6 బిలియన్ సంవత్సరాల నాటి మన సౌరవ్యవస్థలో ఇలాంటివి చాలా ఏర్పడ్డాయి. ప్రస్తుతం సౌర కుటుంబంలో 10,97,106 గ్రహశకలాలు ఉన్నాయని సమాచారం. అయితే మెటీయోర్స్ అని వేరే రకం శకలాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు వెలుగు విరజిమ్ముతూ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2008 గో2 విషయంలో చైనా పరిశోధకులు ఆసక్తికర ప్రతిపాదన చేయడం విశేషం. ఈ గ్రహశకలంపై రాకెట్లను ప్రయోగించి... శకలం దారి మరల్చే ప్రయత్నం చేయొచ్చు అని చైనా అంటోంది. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి గ్రహశకలాలు భూమివైపునకు వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు, చేయాల్సిన పనుల గురించి ఓ అవగాహన వస్తుంది అని ప్రతిపాదించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలాంటి గ్రహశకలాల్ని గమనించేందుకు నాసా దగ్గర ప్లానెటరీ డిఫెన్స్ సిస్టం ఉంది. త్వరలో నాసా... డబుల్ ఆస్టరాయడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్‌ను పంపబోతోంది. ఈ మిషన్... వేగంగా దూసుకెళ్లి... 780 మీటర్ల సైజు ఉన్న ఆస్టరాయిడ్ డిడిమోస్ (Didymos)ను ఢీకొట్టనుంది. ఇందుకోసం ఆ మిషన్ సెకండ్‌కి 6.6 కిలోమీర్ల వేగంతో వెళ్లనుంది. 2022 అక్టోబర్‌లో ఈ విధ్వంసం జరగనుందని అంచనా. ఇలా ఎందుకంటే... భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమివైపు వస్తూ ఉంటే... అది రాకముందే దాన్ని పేల్చేయాలన్నది నాసా ప్లాన్. అందులో ఇది తొలి ప్రయోగం అన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)
డార్ట్ మిషన్ విజయవంతం అయితే... భూమి గ్రహశకలాల ముప్పు నుంచి కొంతవరకూ బయటపడినట్లు అవుతుంది. 6.6 కోట్ల సంవత్సరాల కిందట కొన్ని కిలోమీటర్ల సైజు ఉన్న ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల భూమిపై ఉన్న జీవుల్లో మూడోవంతు అంతరించిపోయాయి. రాక్షస బల్లులు కూడా దాని వల్లే అంతరించిపోయాయని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)







