NASA : ఇస్రో చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.... చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిందన్న విషయం మనకు తెలుసు. ఐతే... చందమామపై చీకటి వల్ల ఇన్నాళ్లూ ఆ ల్యాండర్ ఎక్కడ కూలిపోయిందో కనిపెట్టలేకపోయాం. ఐతే... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా... తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది. (credit - nasa.gov)
నాసాకు చెందిన ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ (LRO) ఈ ల్యాండర్‌ను గుర్తించి ఫొటోలు తీసింది. ఐతే... కూలిన ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చిందరవందరగా పడినట్లు నాసా తెలిపింది. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు పడినట్లు గుర్తించింది. ఓవరాల్‌గా కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఇవి ఉన్నట్లు తెలిపింది. (credit - nasa.gov)
జులైలో ఇస్రో... చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా, రష్యా, చైనా, తర్వాత చంద్రుడిపై ల్యాండర్‌ను దింపిన దేశం భారతే. అంతేకాదు... చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపిన తొలి దేశం భారతే. ప్రస్తుతం చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్... చందమామ చుట్టూ బ్రహ్మాండంగా తిరుగుతోంది. విక్రమ్ ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం పనిచెయ్యట్లేదు. (credit - nasa.gov)