Asteroid: మన సౌరకుటుంబంలో... అంగారక (Mars) గ్రహం, గురు (Jupiter) గ్రహం మధ్య గ్రహశకలాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అప్పుడప్పుడూ భూమివైపు వస్తుంటాయి. అలాంటి ఓ గ్రహశకలం... తాజ్‌మహల్ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్నది జులై 25న భూమికి దగ్గరగా వస్తోంది. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) ప్రకారం... ఆస్టరాయిడ్ 2008 GO20... మొత్తం 220 మీటర్ల వ్యాసార్థం (diameter)తో ఉంది. జులై 25న ఉదయం 3 గంటల (ఇండియన్ టైమ్ ప్రకారం)కు ఇది భూమికి దగ్గరగా వస్తుంది. ఆ సమయంలో అది భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మనకు నో టెన్షన్. (ప్రతీకాత్మక చిత్రం)
భూమికీ, చందమామకూ మధ్య ఉన్న దూరంతో పోల్చితే... గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 12 రెట్లు దూరంగా ఉన్నట్లే. కానీ నాసా మాత్రం దీన్ని భూమికి దగ్గరగా ఉన్న గ్రహశకలాల్లో ఒకటిగా చేర్చింది. అంటే ఇప్పుడు కాకపోయినా... ఎప్పుడైనా ఈ గ్రహ శకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. భూమికి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్ల లోపు వచ్చే గ్రహశకలాలను దగ్గరగా ఉండే ఆస్టరాయిడ్లు (near-earth object)గా నాసా చెబుతోంది. ఇలాంటివి ఓ 2వేల దాకా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
శక్తిమంతమైన ప్రమాదకరమైన గ్రహశకలాల్లో ఇదీ ఒకటిగా నాసా తేల్చింది. ఇలాంటి ఆస్టరాయిడ్లను నాసా టెలిస్కోపులు రోజూ గమనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఏదో ఒకటి భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంటే... ముందే తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చెయ్యాలన్నది నాసా ఆలోచన. గ్రహశకలాలతో ఉన్న సమస్యేంటంటే... అవి గ్రహాలలాగే ఒకే దిశలో వెళ్లవు. వాటికి కక్ష్యామార్గం అనేది ఉండదు. అవి వెళ్లే దారిలో... మరేదైనా గ్రహశకలం వాటిని ఢీకొంటే... రూట్ మారిపోతుంది. అలా మారిన గ్రహశకలం... భూమిని ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే నాసా వాటిపై ఎప్పుడూ ఫోకస్ పెడుతూనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలాంటి గ్రహశకలాల్ని గమనించేందుకు నాసా దగ్గర ప్లానెటరీ డిఫెన్స్ సిస్టం ఉంది. త్వరలో నాసా... డబుల్ ఆస్టరాయడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) మిషన్‌ను పంపబోతోంది. ఈ మిషన్... వేగంగా దూసుకెళ్లి... 780 మీటర్ల సైజు ఉన్న ఆస్టరాయిడ్ డిడిమోస్ (Didymos)ను ఢీకొట్టనుంది. ఇందుకోసం ఆ మిషన్ సెకండ్‌కి 6.6 కిలోమీర్ల వేగంతో వెళ్లనుంది. 2022 అక్టోబర్‌లో ఈ విధ్వంసం జరగనుందని అంచనా. ఇలా ఎందుకంటే... భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమివైపు వస్తూ ఉంటే... అది రాకముందే దాన్ని పేల్చేయాలన్నది నాసా ప్లాన్. అందులో ఇది తొలి ప్రయోగం అన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)
డార్ట్ మిషన్ విజయవంతం అయితే... భూమి గ్రహశకలాల ముప్పు నుంచి కొంతవరకూ బయటపడినట్లు అవుతుంది. 6.6 కోట్ల సంవత్సరాల కిందట కొన్ని కిలోమీటర్ల సైజు ఉన్న ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల భూమిపై ఉన్న జీవుల్లో మూడోవంతు అంతరించిపోయాయి. రాక్షస బల్లులు కూడా దాని వల్లే అంతరించిపోయాయని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)