1. బడ్జెట్, మధ్యశ్రేణి ఫోన్ల విభాగంలో ముందున్న మోటొరోలా ప్రీమియం క్యాటగిరీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తున్నామని కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, క్వాలిటీ కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్ జులైలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. తాజాగా స్మార్ట్‌ఫోన్ గ్రాండియర్ కెమరా ఫీచర్లతో పాటు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్తో 125డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మొటొరోలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ఫోటోలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని కంపెనీ మొబైల్ ఫోన్ బిజినెస్ జనరల్ మేనేజర్ షెన్జిన్ వెల్లడించారు. ఇక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పేరు, ధర ఇతర వివరాలను షెన్జిన్ వెల్లడించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఫ్రాంటియన్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. 200MP ప్రైమరీ సెన్సార్ ఈ ఫోన్లో స్పెషల్ అట్రాక్షన్. దీంతోపాటు మరో రెండు రియర్ లెన్స్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా-వైడ్ యూనిట్ కావచ్చు. వెనుకవైపు LED ఫ్లాష్, మోటొరోలా బ్రాండింగ్ లోగో కూడా కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్తగా లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలను కంపెనీ ధ్రువీకరించాల్సి ఉంది. ఇది 8GB/12GB RAM.. 128GB/256GB వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)లా ఎడ్జ్ 30 సేల్ ఈరోజే... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్
(image: Motorola India)
7. మరోవైపు మోటోరోలా ఇటీవల లాంఛ్ చేసిన మోటో ఎడ్జ్ ఎక్స్ 30 వంటి స్మార్ట్ఫోన్లు భారత్‌లోనూ లాంఛ్ కావడంతో తాజా స్మార్ట్‌ఫోన్ సైతం భారత్‌లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇక జులైలో మోటో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)