కాగా Moto G200 ఫోన్‌తో పాటు Motorola Moto G71, G51 Moto G31 సహా మరెన్నో బడ్జెట్ ఆఫర్లను భారత మార్కెట్లో ప్రారంభించనుంది. ఈ మూడు మోటో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే యూరప్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. కొత్త Moto ఫోన్ ఇండియాలో లాంచ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే Moto G200 లాంచ్ సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెల్లడించలేదు.
మోటో స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. Moto G200 ఫోన్ 6.8-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేతో 144Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Moto G200 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ SoC ద్వారా పనిచేస్తుంది. 8GB RAM, 256GB RAMతో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకే RAM వేరియంట్లో మార్కెట్లోకి రానుంది. కానీ, 128GB, 256GB సహా రెండు స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది.